Tuesday, April 30, 2024

చెన్నైలోనే ఐఫోన్‌ 13 తయారీ, శ్రీపెరంబుదూర్‌లోని ఫాక్స్ కాన్‌ ఫెసిలిటీ

మేక్‌ ఇన్‌ ఇండియాకు ఊతం ఇవ్వడంలో భాగంగా.. అత్యంత ఖరీదైన ఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఫోన్‌ 13ను చెన్నైకి సమీపంగా ఉన్న శ్రీపెరంబుదూర్‌లోని ఫాక్స్‌కాన్‌ ఫెసిలిటీలో తయారు చేయనున్నట్టు ప్రకటించింది. యాపిల్‌ కాంట్రాక్టు తయారీ భాగస్వామిగా ఫాక్స్‌కాన్‌ ఉంది. ఐఫోన్‌ ఎస్‌ఈ మోడల్స్‌ తయారీని 2017లోనే భారత్‌లో ప్రారంభించినట్టు గుర్తు చేసింది. అప్పటి నుంచి భారత్‌లో ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 12 వంటి ప్రీమియం సెల్‌ఫోన్స్‌ను తయారు చేస్తున్నట్టు యాపిల్‌ ప్రకటించింది.

భారత్‌లోనే ఐఫోన్‌ 13 తయారు చేయడం జరుగుతుందని, ఇది ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని యాపిల్‌ సంస్థ తన ప్రకటనలో తెలిపింది. భారతీయుల అభిరుచికి అనుగుణంగా.. అత్యుత్తమ డిజైన్‌, డిస్‌ప్లే, కెమెరా సిస్టమ్‌తో తీసుకురానున్నట్టు పేర్కొంది. ఏ15 బయోనిక్‌ చిప్‌ అమర్చిన ఈ ఫోన్‌ ఇక చెన్నైలోనే తయారు చేస్తున్నట్టు తెలిపింది. ఇక ఐఫోన్‌ 13ను కూడా ఇక్కడే తయారు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement