Friday, April 26, 2024

కాంగ్రెస్‌కు ఠాక్రే వ్యూహం ఫలిస్తుందా..

హస్తం పార్టీకి శస్త్ర చికిత్స చేసేందుకు రానున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌
రెండు రోజులు ఇక్కడే మకాం
పీసీసీ చీఫ్‌, సీఎల్పీతో సహా ఇతర నాయకులతో వేర్వేరుగా సమావేశాలు
నాయకుల మధ్య నెలకొన్న పంచాయతీలు.. పార్టీ బలోపేతానికి తీసుకునే చర్యలపై చర్చ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల ను ఎదుర్కొంటోంది. క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్‌ ఉన్న ప్పటికి.. నిత్యం జనంలో ఉండే పరిస్థితి లేకుండా పోతుందనే విమర్శలను ఎదుర్కొంటోంది. పార్టీ నాయకుల మధ్య కల హాలు, చిన్న చిన్న పంచాయతీల వల్ల అధికార పార్టీపై సరైన విధంగా యుద్ధం చేయడం లేదని, ఒక వేళ ప్రజా సమస్యలపై టీ పీసీసీ కార్యక్రమాలు ఇచ్చినా పూర్తిగా విజయవంతం చేయ డంలో విఫలమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమమయంలో రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌గా కాంగ్రెస్‌ అధిష్టానం నియమించిన మాణిక్‌రావు ఠాక్రే వ్యూహాం ఏ మేరకు పని చేస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నాయి. ‘ ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంది. తెలంగాణ కాంగ్రెస్‌కు ఠాక్రే ఇచ్చే శస్త్ర చికిత్స ఏ మేరకు పలి స్తుంది. ఆయన వ్యూహాంతో పార్టీ నాయకులందరు ఏకతాటికి వస్తారా..? కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారా..? ‘ అని సొంత పార్టీ నాయకుల్లోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే కలహాలకు , గ్రూప్‌ తగాదాలకు నిలయమని, ఒకరంటే మరొకరికి గిట్టని వ్యహారం ఉండటమే కాకుండా.. ఒకరు ఎడ్డెం అంటే.. మరొకరు తెడ్డెం అంటారనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి.
ఇప్పటీ వరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న మానిక్యం ఠాగూర్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులను సమన్వయం చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు రావడంతో.. ఆయన్ను పార్టీ అధిష్టానం ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించింది. మానిక్యం ఠాగూర్‌ స్థానంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి మాణిక్‌రావు ఠాక్రేన్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించిన విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న ఠాక్రే బుధవారం మొదటిసారిగా రా ష్ట్రానికి రానున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో పార్టీ నేతలతోనే విడీ విడిగా ఠాక్రే సమావేశమై అందరి అభిప్రాయాలను తీసుకుని తిరిగి గురువారం ఢిల్లిdకి వెళ్లనున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీకి చెందిన పలువురు సీని యర్లు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్‌ ఉపా ధ్యక్షులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాలు, ఇతర నాయకులతో వేర్వేరుగా సమావేశమై.. పార్టీ బలోపే తా నికి తీసుకునే అంశాలు, నేతల మధ్య నెలకొన్న పంచా యతీలపై కిందిస్థాయి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రెండు గ్రూప్‌లుగా విడి పోయారు. టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో పలువురు సీనియర్లు తిరుగుబాటు చేయగా.. పార్టీ అధిష్టానం వెనువెంటనే తేరుకుని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ను రంగంలోకి దింపి టీ పీసీసీలో నెలకొన్న అసంతృప్తిని తాత్కాలికంగా చల్లబర్చారు. డిగ్గీ రాజా హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర పార్టీ నేతల అభి ప్రాయా లను తీసుకుని ఢిల్లిdకి వెళ్లి అధిష్టానానికి నివేదిక ఇచ్చా రు. ఆ తర్వాతనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న మానిక్యం ఠాగూర్‌ను తప్పించి మాణిక్‌రావు ఠాక్రేకు తెలం గాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీకి గ్రూప్‌ తగాదాలు, నాయకుల మధ్య మనస్ఫర్దలు కొత్తేమి కానప్పటికీ .. ఇప్పుడున్న పంచాయతీలు మాత్రం చికాకు కలిగిస్తున్నాయని కిందిస్థాయి కేడర్‌ అసంతృప్తికి వ్యక్తం చేస్తోంది. ఒక వైపు సీఎం కేసీఆర్‌ తన పార్టీని మరింత బలోపేం చేసుకుంటు తిరిగి మూడోసారి అధికారంలోకి రావాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. మరో వైపు తెలంగాణలో గత ఎన్నికల వరకు అంతగా బలం లేని బీజేపీ.. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామనేని సవాల్‌ విసురుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు నిత్యం జనంలో ఉండే విధంగా కార్యాచరణతో బీజేపీ నేతలు ముందుకు సాగుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఆ పార్టీ నేతలు వివిధ సమ స్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణలో బలంగా ఉండి ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ నాయకులు గొడవలతో ప్రజల్లో నమ్మకం పొగట్టుకునే పరిస్థితికి వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నా యి. సొంత ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు తిప్పుకుంటనే అధికారం సాధ్యమని పలువురు కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడు తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా, రెండు పర్యాయాలు మంత్రిగా పని చేయడంతో.. ఆయన సీనియార్టీ పనికొస్తుందని, ఇక్కడి నాయకులు ఆయన మాటకు గౌరవం ఇస్తారని పలువరు పార్టీ నేతలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement