Thursday, May 2, 2024

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’.. పూజా కార్య‌క్ర‌మాల‌తో గ్రాండ్ లాంచ్

తొలిసారిగా భారీ పాన్ ఇండియన్ సినిమా ‘కన్నప్ప’ తో త్వరలో ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు మంచు విష్ణు. కాగా, ఈ మూవీని ఇవ్వాల‌ శ్రీకాళహస్తిలో అఫీషియల్ గా పూజా కార్యక్ర‌మాల‌తో గ్రాండ్ గా లాంచ్ చేసారు. ఇక, సినిమా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై అత్యంత భారీ వ్యయంతో నిర్మితం కానుంది. అయితే, ఈ మూవీ తన డ్రీం ప్రాజక్ట్ అని పలు సందర్భాల్లో మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

ఈ భారీ పాన్ ఇండియా మూవీకి ముకేశ్ కుమార్ సింగ్ కన్నప్ప కి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విష్ణు కి జోడీగా నుపుర్ సనన్ హీరోయిన్ గా కనిపించనుంది. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నండ‌గా.. ఇవ్వాల జ‌రిగిన పూజా కార్యక్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సహా పలువురు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కాగా, ఈ లాంచ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement