Sunday, April 28, 2024

HYD: డబుల్ బెడ్రూమ్ ల పేరుతో పేదలను మభ్య పెడుతోన్న ప్రభుత్వం: సామ రంగారెడ్డి

ఎల్బీనగర్ : డబుల్ బెడ్రూమ్ ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతుందని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అర్హులైన పేదలందరికి డబుల్ రూమ్ లు కేటాయించాలని శుక్రవారం ఎల్.బి నగర్ లో కార్పొరేటర్లు పార్టీ కార్యకర్తలతో కలిసి చింతలకుంట వియజయవాడ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టి రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ… గత 9 సంవత్సరాలుగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వేలల్లో డబల్ బెడ్రూముల కోసం దరఖాస్తు చేసుకోగా కేవలం వందలలో నిర్మించారన్నారు. అవి కూడా బారాస కార్యకర్తలకు, స్థానిక ఎమ్మెల్యే అనుచరులకు కట్టబెట్టారన్నారు. ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని గద్దె దింపడం బీజేపీ కే సాధ్యమన్నారు. విజ్ఞులైన ప్రజలు రాబోయే కాలంలో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

- Advertisement -

బీజేపీ నేతల ఆందోళనతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అవ్వడంతో పోలీస్ లు వచ్చి నాయకులను అరెస్ట్ చేసి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలిచారు. ఈ ఆందోళనలో కళ్లెం నవ జీవన్ రెడ్డి, కొత్త రవీందర్ గౌడ్, వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్, శ్యామల, కృష్ణవేణి, సామ ప్రభాకర్ రెడ్డి, అంజాన్ కుమార్ గౌడ్, చెక్క అశోక్ కుమార్, రాకేష్ యాదవ్, కవిత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement