Tuesday, April 30, 2024

షాకింగ్ వీడియో: వధువు డ్రస్సు నుంచి బయటకు వచ్చిన వ్యక్తి..

ఫిలిప్పీన్స్‌కి రోయెల్ లూనెసా అనే ఓ వెడ్డింగ్ ప్లానర్‌ ఓ వింత పనిచేసి ఇప్పుడు వైరల్ గా మారాడు. తాను నిర్వహిస్తున్న పెళ్లిలో వధువు డ్రస్స్ లో నుంచి బయటకు వచ్చి అందరిని ఆశ్యర్యపరిచాడు. ఏంటీ వధువు డ్రస్ లో నుంచి ఓ మనిషి బయటకు రావడమేంటని ఆలోచిస్తున్నారు కదూ.. కాని జరిగింది ఇదే.. అసలేం జరిగిందంటే..పెళ్లి వేడుకలో ఏర్పాటు చేసిన ఫ్యాన్ల ద్వారా బలమైన గాలి వీచి డ్రస్ ఎగిరిపోతూ వధువు ఇబ్బందులు పడుతుందని రోయెల్ లూనెసా గ్రహించాడు. దీంతో అతడు ఆమె డ్రస్ కింద దాక్కుని ఆమె నడిచేందుకు వీలుగా ఉంటూ, ఆమె డ్రస్ ఎగిరిపోకుండా పట్టుకున్నాడు. వధువును వరుడు పెళ్లి వేదిక వరకు తీసుకుని పోయే దాకా అతడు అలాగే ఉన్నాడు. పెళ్లి వేదిక దగ్గరకు రాగానే అతడు ఆమె డ్రస్ లోంచి హఠాత్తుగా బయటకు వచ్చాడు. బంధువుల్లో కలిసిపోయాడు. అయితే ఇతడి నిర్వాకాన్ని అక్కడ ఉన్న బంధువులు ఎవరూ పట్టించుకోనట్టుగా ఉండిపోవడం గమనార్హం. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement