Thursday, May 9, 2024

స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఏజెంట్ .. లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

ఏజెంట్ మూవీ కోసం త‌న మేకోవ‌ర్ ని పూర్తిగా మార్చుకున్నాడు హీరో అఖిల్. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు ఈ యంగ్ హీరో. కాగా ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నాడు.స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సాగే సినిమా ఇది.భారీ యాక్షన్ దృశ్యాల కారణంగా .. దాదాపు విదేశాల్లోనే చిత్రీకరించడం వలన ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరిగింది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. మళ్లీ మళ్లీ నువ్వే ఎదురెదురొస్తే ..’ అంటూ ఈ పాట సాగుతోంది. తెలుగు .. ఇంగ్లిష్ మిక్స్ చేసి అల్లిన పదాల అమరికతోనే పాట అంతా కనిపిస్తోంది. హిప్ హాప్ తమిళ సంగీతాన్ని స్వరపరిచిన ఈ పాటను హీరో హీరోయిన్లపై ఫారిన్ లో చిత్రీకరించారు. బీట్ ప్రధానంగా సాగే పాట ఇది .. పాఠం అప్పగించినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి సాక్షి వైద్య కథానాయికగా పరిచయమవుతోంది. మలయాళ స్టార్ మమ్మట్టి ఈ సినిమాలో కల్నల్ పాత్రలో కనిపించనున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement