Monday, April 29, 2024

మళయాళ స్టార్ కమెడియన్ ప్రేమ్ కుమార్ క‌న్నుమూత‌.. సీఎం పిన‌ర‌యి ప్ర‌గాఢ సానుభూతి

ప్రముఖ మలయాళీ నటుడు కొచ్చు ప్రేమన్ ప్రేరుతో బాగా పాపులర్ అయిన కే.యస్. ప్రేమ్ కుమార్..ఆయ‌న అనారోగ్యంతో మరణించారు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతూ వస్తున్న ఆయన… పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్టు తెలుస్తుంది. ప్రేమన్ మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 68 ఏళ్ళ కొచ్చు ప్రేమన్ కేరళ లో తిరువనంతపురంలో ఉన్న ఆయన నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్టు సమాచారం.

ప్రేమన్ మరణ వార్త విని మాలీవుడ్ షాక్ తిన్నది. స్టార్ సెలబ్రిటీస్ దిగ్బ్రాంతి వ్యాక్తం చేశారు. ప్రేమ్ కుమార్ కు సంతాపంతెలుపుతున్నారు. కే.యస్. ప్రేమ్ కుమార్ మలయాళంలో 150 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఎక్కువగా కామెడీ రోల్స్ చేస్తుంటారు ప్రేమన్. ఈయన కామెడీకి అక్కడ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సీరియల్స్ లో సహాయ నటుడిగా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ప్రేమ్ కుమార్.. అంచలంచలుగా ఎదుగుతూ..ఫిల్మ్ ఇండస్రీలో స్టార్ కమెడియన్ అవతారం ఎత్తారు. మలయాళ పరిశ్రమ నుంచి ఎన్నో అవార్డ్ లు సాధించిన ప్రేమన్ .. అకాలమరణంతో మలయాళ పరిశ్రమ చి నబోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement