Sunday, October 6, 2024

రోడ్డు ప్ర‌మాదంలో మ‌ళ‌యాళం న‌టుడు సుధి దుర్మ‌ర‌ణం..

తిరువ‌నంత‌పురం – కేరళలోని కైపమంగళం వద్ద నేటి తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు కొల్లం సుధి (39) మృతి చెందారు. ఆయనతోపాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురు.. మిమిక్రీ ఆర్టిస్ట్ బిను అడిమాలు, ఉల్లాస్, మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు. వటకరలోని ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో సుధి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను కొడుంగల్లూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగతా ముగ్గురికీ చికిత్స కొనసాగుతోంది.

కాగా, సుధి మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. సుధి 2015లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ అయిన సుధి కొట్టప్పనయిలే రిత్విక్ రోషన్, కుట్టనదన్ మరప్పప్ప సహా పలు సినిమాల్లో నటించాడు. సుధి మృతివార్త తెలిసిన వెంటనే మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం అలముకుంది. ఆయన మృతికి పలువురు నటీనటులు సంతాపం తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement