Friday, April 19, 2024

Kollam – Chennai Express – రైలు బోగీకి ప‌గుళ్లు … అప్ర‌మ‌త్త‌తతో త‌ప్పిన పెను ప్ర‌మాదం..

చెన్నై – తమిళనాడులోని కొల్లాం – చెన్నై ఎగ్మూర్ ఎక్స్‌ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. ఎస్3 కోచ్ చాసిస్ లో పగుళ్లు ఏర్పడినట్లుగా రైల్వే సిబ్బంది గుర్తించారు. దీంతో రైలును నిలిపివేసి.. ప్రయాణికులను పక్క బోగీలోకి పంపారు. ఆ పగుళ్లు ఏర్పడిన బోగీని రైలు నుంచి వేరు చేసి దాని స్థానంలో కొత్త కోచ్‌ను చేర్చారు. కాస్త ఆలస్యంగా రైలు తిరిగి బయల్దేరింది.

‘‘ఎగ్మూర్ ఎక్స్‌ప్రెస్ కొల్లాం నుంచి చెన్నైకి ఆదివారం మధ్యాహ్నం 3.30కు బయలుదేరింది. రైలు సాయంత్రం సెంగోట్టై స్టేషన్‌కు చేరుకున్నాక.. ఎస్3 కోచ్ బేస్ వద్ద పగుళ్లు ఏర్పడినట్లుగా రైల్వే సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు’’ అని దక్షిణ రైల్వే తెలిపింది. దీంతో రైలును కొద్ది సేపు అక్కడే నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. పగుళ్లు ఏర్పడిన కోచ్ ను తప్పించి, వేరే కోచ్ ను ఏర్పాటు చేసినట్లు వెల్ల‌డించింది.. 4.40కి ట్రైన్ బయల్దేరినట్లు వివరించారు. పగుళ్లను గుర్తించి, అప్రమత్తం చేసిన సిబ్బందిని అభినందిస్తూ,. మదురై డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్‌ ద్వారా అవార్డు ఇప్పిస్తామని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement