Friday, February 3, 2023

బాలీవుడ్ మూవీలో విల‌న్ గా మ‌ల‌యాళ స్టార్ హీరో.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్ ప్రస్తుతం ఈయన సౌత్‌, నార్త్‌ అని తేడా లేకుండా ప్రతీ భాషలో మార్కెట్‌ పెంచుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు ..పృథ్వీరాజ్‌ తాజాగా బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమయ్యారు. అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం బడే మియాన్‌ చోటే మియాన్ . అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ విల‌న్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ కబీర్‌ పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రాన్ని పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆజ్‌ ఫిలింస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని హిందీతో పాటు సౌత్‌లోని అన్ని భాషల్లో వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో బ్లూ కలర్‌ బ్లేజర్‌ ధరించి స్టైలిష్‌ విలన్‌లా ఉన్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement