Tuesday, May 7, 2024

అజిత్ కొత్త చిత్రం తెగింపు.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. ఆయన తాజా చిత్రంగా ‘తునీవు’ రూపొందింది. బోనీకపూర్ నిర్మించిన ఈ సినిమాకి, వినోత్ దర్శకత్వం వహించాడు. ఎమోషన్ తో కూడిన యాక్షన్ ఎంటర్టయినర్ ఇది. అజిత్ సరసన నాయికగా మంజు వారియర్ కనిపించనుంది. ఇంతకుముందు అజిత్ నుంచి వచ్చిన ‘వలిమై’ అదే టైటిల్ తో తెలుగులో విడుదలై విమర్శలను మూటగట్టుకుంది.

అందువలన ‘తునీవు’ సినిమాకు తెలుగులో టైటిల్ ఫిక్స్ చేశారు. ‘తెగింపు’ టైటిల్ ను ఖరారు చేసి పోస్టర్ ను వదిలారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో అజిత్ .. యాక్షన్ మోడ్ లో ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తమిళంలో వరిసు .. తునీవు ఒకేసారి విడుదలవుతూ ఉండటంతో, అభిమానుల్లో ఆసక్తి పెరుగుతూ పోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement