Sunday, April 28, 2024

Maharashtra – కన్నీళ్లు తెప్పిస్తున్న అన్నదాతల ఆత్మహత్యలు…10 నెలల్లో 2366 మంది బలవన్మరణాలు

ముంబై – మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. గడిచిన పది నెలల్లోనే 2వేలకు పైగా రైతుల బలవన్మరణాలు చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ వరకు రాష్ట్రవ్యాప్తంగా 2366 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అమరావతి డివిజన్‌లోనే అత్యధికంగా రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్లు తేలింది.

ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ వరకు రాష్ట్రవ్యాప్తంగా 2366 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇందులో అత్యధికంగా అమరావతి డివిజన్‌లోనే 951 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఛత్రపతి శంభాజినగర్‌ డివిజన్‌లో 877, నాగ్‌పుర్‌ డివిజన్‌లో 257, నాసిక్‌ డివిజన్‌లో 254, పుణె డివిజన్‌లో 27 మరణాలు నమోదయ్యాయి’ అని రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి అనిల్‌ భైదాస్‌ వెల్లడించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కాంగ్రెస్‌ సభ్యుడు కునాల్‌ పాటిల్‌ అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. బాధిత కుటుంబీకులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement