Friday, May 3, 2024

Suspensions – పార్ల‌మెంట్ లో విప‌క్షాల ర‌గ‌డ …15 మంది స‌భ్యుల స‌స్పెండ్

న్యూఢిల్లీ – పార్లమెంట్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 15 మంది ఎంపీలు సస్పెన్షన్‌కి గురయ్యారు. సస్పెండ్ అయిన వారిలో ఒక రాజ్యసభ ఎంపీతో పాటు 14 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. సస్పెండ్ అయిన సభ్యుల్లో మాణికం ఠాగూర్, కనిమొళి, పీఆర్ నటరాజన్, వీకే శ్రీకాంతం, బేణి బహన్, కే సుబ్రమణ్యం, ఎస్ఆర్ ప్రతిబన్, ఎస్ వెంకటేషన్, మహ్మద్ జావేద్ ఉన్నారు. ఎంపీల్లో 9 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. సీపీఎంకు చెందిన ఇద్దరు, డీఎంకేకి చెందిన ఇద్దరు, సీపీఐ నుంచి ఒక ఎంపీ ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. వారిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సభ నుంచి సస్పెండ్‌ చేశారు.

తొలుత ఐదుగుర్ని సస్పెండ్‌ చేయగా.. ఆ తర్వాత మరో 9 మందిపై వేటు పడింది. మొదట సస్పన్షన్‌కు గురైన వారిలో ప్రతాపన్‌, హిబీ ఈడన్‌, జోతి మణి, రమ్యా హరిదాస్‌, డీన్‌ కురియాకోస్‌ ఉన్నారు. సభాపతి ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించారనే కారణంగానే వీరిపై చర్యలు తీసుకొన్నట్లు తెలుస్తోంది. ”టీఎన్‌ ప్రతాపన్‌, హిబీ ఈడన్‌, జోతిమణి, రమ్యా హరిదాస్‌, డీన్‌ కురియకోస్‌లు సభాపతి ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రవర్తించిన తీరును తీవ్రంగా పరిగణిస్తూ ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నాం” అని తొలుత పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్‌ జోషీ సభలో పేర్కొన్నారు. తీర్మానం అధారంగా మొత్తం 14 మంది లోక్ స‌భ స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేశారు. అంతకు ముందు రాజ్యసభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ ఓబ్రియన్‌ కూడా సస్పెండ్‌ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement