Thursday, May 9, 2024

LSG vs RR | రాజస్థాన్ రాజసం… లక్నో పై విజయం

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ విజయం సాధించింది. వరుస విజయాలతో మంచి జోరుమీదున్న రాజస్థాన్… ఐపీఎల్ లో జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోంది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్లతో గెలుపొందింది. లక్నో నిర్దేశించిన 197 ప‌రుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఇంకా ఆరు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. టాపార్డ‌ర్ విఫ‌లమైనా… కెప్టెన్ సంజూ శాంస‌న్ (71 నాఔట‌ట్), ధ్రువ్ జురెల్ (52 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో ఆడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement