Monday, May 20, 2024

రోజుకు 4 మిలియన్‌ డాలర్ల నష్టం, ఉద్యోగుల కోత తప్పదన్న మస్క్‌

ట్విటర్‌ కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ సంస్థలో సగం మంది ఉద్యోగులను తొలగించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన స్పందించారు. ట్విటర్‌ రోజుకు 4 మిలియన్‌ డాలర్లకు పైగా నష్టాపోతున్నందున, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని ఆయన సమర్ధించుకున్నారు. తనకు మరోదారి లేకపోయిందని ఆయన ట్విట్‌ చేశారు. ఇలా తొలగించి ఉద్యోగులకు మూడు నెలల వేతనం ఇచ్చినట్లు తెలిపారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన దానికంటే ఇది 50 శాతం ఎక్కువేనని ఆయన తెలిపారు. ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ వారం రోజుల్లోనే సంస్థలో అనేక కీలక మార్పుులు చేశారు. తొలగించి ఉద్యోగులందరికీ శుక్రవారం నాడే ఇ-మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్‌కు 7500 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 3738 మందికి లేఆఫ్‌ ఇ-మెయిల్స్‌ పంపించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల తొలగించడానికి ముందు ఉద్యోగులు, కస్టమర్ల డేటా భద్రత కోసం ట్విటర్‌ అన్ని కార్యాలయాలను మూసివేసింది.

సామాజిక కార్యకర్తల వల్లే….

ట్విటర్‌ ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణం సామాజిక కార్యకర్తలేనని ఎలాన్‌ మస్క్‌ ఆరోపించారు. కంటెంట్‌ నియంంత్రణలో ఏమీ మారనప్పటికీ కొందరు సామాజిక కార్యకర్తలు ప్రటకనదారులపై ఒత్తిడి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్లే ట్విటర్‌ ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. కార్యకర్తలను శాంతింప చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నామని చెప్పారు. అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వారు నాశనం చేస్తున్నారని మస్క్‌ ఆరోపించారు.

ఇండియాలో…

మన దేశంలోని ట్విటర్‌ కార్యాలయంలో పని చేస్తున్న 230 మంది ఉద్యోగుల్లో 180 మందికి లేఆఫ్‌ ఆదేశాలు వచ్చాయని సమాచారం. ట్విటర్‌ ఇండియాలో చాలా కొద్ది మంది ఉద్యోగులను మాత్రమే ఇలాంటి ఇ-మెయిల్స్‌ అందలేదని ఒక ఉద్యోగి చెప్పారు. శుక్రవారం ఉదయమే చాలా మంది ఉద్యోగులకు ఇ-మెయిల్స్‌ వచ్చాయని, వారికి కంపెనీ సైట్‌ను యాక్సెస్‌ చేయలేకపోయారని తెలిపారు. అత్యంత కీలకమైన మెయింటెనెన్స్‌ ఆపరేషన్స్‌ నిర్వహించేవారు, ప్రభుత్వ ఎంగేజ్‌మెంట్స్‌ చూసే కొద్ద మంది ఉద్యోగులను మాత్రమే ట్విటర్‌లో మిగిలారని తెల్సింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement