Wednesday, May 15, 2024

లోకి సీజన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక మార్వెల్ ఫ్యాన్స్ కు పండ‌గే !

మార్వెల్ స్టూడియోస్ నుంచి వ‌చ్చిన‌ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లలో సెన్సేషనల్ హిట్ అయిన‌ వెబ్ సిరీస్ “లోకి”. ఈ సిరీస్ మార్వెల్ ఫ్యాన్స్ ని బాగా ఆక‌ట్టుకుంది. టామ్ హిడ్లస్టన్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ సిరీస్ తోనే అప్ క‌మింగ్ మూవీస్ & సిరీస్ అన్నీ ముడిపడి ఉన్నాయని అర్ధం అయ్యింది.

ఇక ఈ ఫస్ట్ సీజన్ పెద్ద హిట్ కావడంతో.. ఇక సీజన్ 2 ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే, రెండు సంవత్సరాల వేయిటింగ్ త‌రువాత ఈ సిరీస్ సీక్వెల్ తో సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. కాగా, ఈ సిరీస్ ఈ ఏడాది అక్టోబర్ 6 నుంచి డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్టుగా తెలిపారు. మొత్తానికి అయితే లోకి ఫ్యాన్స్ కి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement