Thursday, May 9, 2024

lobo: తండ్రి అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. లోబోకు కవల పిల్లలు!

లోబో… పరిచయం అక్కర్లేని పేరు. బిగ్ బాస్ షోలో లోబో సెలబ్రిటీలగా మారిపోయాడు. అందరి కంటే వెరైటీ జుట్టుతో, డిఫరెంట్‌ డ్రెస్సుతో స్పెషల్ గా కనిపిస్తాడు. స్తీ నుంచి వచ్చాను అంటూ హైదరాబాదీ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొదట్లో చిన్నచిన్న సినిమాల్లో కనిపించని లోబో.. బిగ్‌బాస్‌ షోతో అందరి మనసు దోచుకున్నాడు. తనదైన కామెడితో షోలో నవ్వులు పూయించాడు. అయితే, షో నుండి ముందుగానే తొలగించబడ్డాడు.

లోబో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినప్పుడు ఆయన భార్య గర్భిణిగా ఉంది. తాజాగా లోబో తండ్ర అయ్యాడు. లోబో భార్య కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. లోబోకు మగబిడ్డ, ఆడపిల్ల జన్మించినట్లు తెలుస్తోంది. ఈ వార్త లోబో అభిమానులకు చాలా సంతోషాన్ని కలిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement