Tuesday, April 30, 2024

ఎఫ్3 నుండి ప్రోమో – పూజాహెగ్డే తో వెంకీ..వ‌రుణ్ ల డ్యాన్స్

ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న కామెడీ చిత్రం ఎఫ్‌3. హీరోలు వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 2019లో సంక్రాంతి కానుక‌గా విడుద‌లై భారీ విజ‌యాన్ని సాధించిన ఎఫ్‌-2 చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రంపై మొద‌టి నుంచే ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఇటీవ‌లే విడుద‌లైన ట్రైల‌ర్ మరింత అంచ‌నాల‌ను పెంచింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం మే27న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్‌ల‌ను ఇస్తూ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రంలోని స్పెష‌ల్ సాంగ్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా’ అంటూ సాగే ఈ ప్రోమో ఆక‌ట్టుకుంటుంది. పూజాహెగ్డే న‌ర్తించిన ఈ సాంగ్ పూర్తి లిరిక‌ల్ వీడియో మే 17న విడుద‌ల కానుంది. ఈ ప్రోమోలో వెంక‌టేష్‌, వ‌రుణ్‌, పూజా వేసిన చిందులు అల‌రిస్తున్నాయి. దేవీ శ్రీ ప్ర‌సాద్ స్వ‌ర ప‌రిచిన ఈ పాట‌కు కాస‌ర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించ‌గా, రాహుల్ సిప్లీగంజ్‌, గీతా మాధురి ఆల‌పించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement