Saturday, May 18, 2024

జీ-సెక్‌, ఈక్విటీస్‌లో ఎల్‌ఐసీ అదుర్స్‌.. బీమా సంస్థకు 17 శాతం వాటా

ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ త్వ‌రలో ఐపీఓగా ముందుకు రాబోతున్నది. గవర్నమెంట్‌ సెక్యురిటీస్‌ (జీ-సెక్‌)లలోను 17 శాతం వాటాను ఎల్‌ఐసీ కలిగి ఉంది. ఈకిటీస్‌ సింగిల్‌ లార్జెస్ట్‌ యజమాని, లార్జెస్ట్‌ ఫండ్‌ మేనేజర్‌ అలాగే హౌస్‌ సేవింగ్స్‌ హోల్డర్‌ అయిన ఎల్‌ఐసీ వ్యాల్యూ పరంగా ఎస్‌బీఐ డిపాజిట్స్‌ను కూడా చిన్నదిగా చేస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2061 నాటికి మెచ్యూర్‌ అయ్యే రూ.80.7 లక్షల కోట్లకు పైగా ఉన్న ప్రభుత్వ సెక్యూరిటీలలో 17 శాతం వాటాను కలిగి ఉంది. గవర్నమెంట్‌కు సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నేతృత్వంలోని వాణిజ్య బ్యాంకులు సమష్టిగా 40శాతం కలిగి ఉన్నాయి. ఇతర బీమా సంస్థలు 5శాతం వాటా కలిగి ఉన్నాయి.

3 ట్రిలియన్‌ డాలర్లతో దేశీయ ఈక్విటీ..

స్విస్‌ బ్రోకరేజ్‌ యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ ప్రకారం.. జీ-సెక్‌ల ఎల్‌ఐసీ యాజమాన్యం మార్చి 2019లో గరిష్ట స్థాయికి చేరుకుంది. దాదాపు 3 ట్రిలియన్‌ డాలర్లతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో ఎల్‌ఐసీ అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారుగా ఉంటోంది. ఏయూఎంలో 29శాతం వాటా లేదా 130 బిలియన్‌ డాలర్లతో ఎల్‌ఐసీ దేశీయ సంస్థాగత ఈక్విటీ ఏయూఎంలో అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఎల్‌ఐసీ ఈక్విటీలలో దాదాపు 4శాతం వాటాను కలిగి ఉంది. దాదాపు 9శాతం వాటాతో ప్రభుత్వ యాజమాన్యంలోని స్టాక్స్‌లో ఎల్‌ఐసీకి అసమానమైన అధిక వాటా ఉంది. డిసెంబర్‌ నాటికి రిలయన్స్‌లో 10 శాతం, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ కంపెనీల్లో 5శాతం చొప్పున ఐసీఐసీఐ, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ కంపెనీల్లో 4శాతం చొప్పున ఉంది. లిస్టింగ్‌ అనంతరం లిస్టెడ్‌ ఈక్విటీలలో ప్రభుత్వ పోర్ట్‌పోలియోలో ఎల్‌ఐసీయే అతిపెద్దది అవుతుంది.

రూ.100లో ఎల్‌ఐసీకి రూ.10..

పెట్టుబడుల ఉప సంహరణ ద్వారా ప్రభుత్వ బడ్జెట్‌ ఫైనాన్సింగ్‌ కోణం నుంచి ఎల్‌ఐసీ కీలకమైంది. అలాగే రిలయన్స్‌ 214 బిలియన్‌ డాలర్లు, టీసీఎస్‌ 182 బిలియన్‌ డాలర్ల తరువాత రిలయన్స్‌ 172 బిలియన్‌ డాలర్లతో మూడో అతిపెద్ద కంపెనీగా అవతరిస్తుంది. 28 కోట్ల పాలసీదారులతో గృహ పొదుపులో ఎల్‌ఐసీ గరిష్ట వాటాను కలిగి ఉంది. ఓ నివేదిక ప్రకారం.. ప్రతీ సంవత్సరం కుటుంబాలు ఆదా చేసే ప్రతీ రూ.100లో ఎల్‌ఐసీకి రూ.10 వెళ్తుంది. బ్యాంకు డిపాజిట్స్‌లో 8శాతం ఎస్‌బీఐకి వెళ్తుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement