Friday, May 17, 2024

లియో డిజిట‌ల్ రైట్స్.. ఈ సంస్థ‌కే !

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లియో. ఇవ్వాల‌ (గురువారం) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది ఈ మూవీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై మొదట్నుంచే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక‌ ఈ సినిమా కూడా L.C.U (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)లో భాగమేనా..అని మోద‌లైన చర్చ ఈ మూవీ అంఛ‌నాలు పెంచింది.

ఇక అంచనాలకు తగ్గట్టుగానే మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో సినిమా ఆకట్టుకుంది. L.C.U లోని భాగంగా ఖైదీ, విక్ర‌మ్ సినిమాల‌కు క‌నెక్ష‌న్స్ చూపిస్తూ.. ఇంట్రెస్టెంగ్ గా తెర‌కెక్కించారు. విజయ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ & అద్భుతమైన సినిమాటోగ్రఫీతో ‘లియో’ పైసా వసూల్ ఎంటర్‌టైనర్ అనే చెబుతునున్నారు మూవీ చేసిన ప్రేక్ష‌భిమానులు.

కాగా, ఈ సినిమా కి సంబందించిన నాన్-థియేట్రికల్ పార్ట్నర్స్ పై తాజాగా క్లారిటీ వచ్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం అయిన నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకునున్న‌ట్టు తెలుస్తోంది. అదే విధంగా శాటిలైట్ హక్కులను టీవీ ఛానల్ జెమిని సొంతం చేసుకుంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్ లు కీలక పాత్రల్లో నటించారు. అనిరుద్ రవి చందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement