Tuesday, April 30, 2024

పాలిటెక్నిక ప్రశ్నాపత్రాల లీక! 15, 16వ తేదీల్లో మ‌ళ్లీ ప‌రీక్ష‌లు..

హైదరాబాద్‌ శివారులోని ఓ కాలేజీలో పాలిటెక్నిక్‌ డిప్లొమా ప్రశ్నా పత్రాలు లీకయ్యాయి. రాష్ట్రంలో ఈనెల 8, 9 తేదీల్లో జరిగిన మూడో సెమిస్టర్‌, ఐదవ సెమిస్టర్‌ ప్రశ్నా పత్రాలు లీకయ్యాయి. ప్రశ్నాపత్రాలు లీకైనట్లు తెలియడంతో సాంతేకిత విద్యామండలి (ఎస్‌బీటీ ఈటీ) ఈమేరకు విచారణ చేపట్టింది. విచారణలో హైదరాబాద్‌ శివారులోని బాటసింగారంలోని స్వాతి కాలేజీ నుంచి ప్రశ్నాపత్రాలు లీకైనట్లు అధికారుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. 8, 9 తేదీల్లో జరిగిన పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైనట్లు అధికారులు గుర్తించడంతో ఈనెల 10న కళాశాలపై సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈమేరకు శుక్రవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దాంతో 8, 9 తేదీల్లో జరిగిన పరీక్షలను రద్దు చేసి, 15, 16వ తేదీల్లో వాటిని తిరిగి నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.

షోకాజ్‌ నోటీసులు జారీ…

ప్రశ్నపత్రాల లీకేజీకి కారకులైన వారిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కళాశాలకు ఉన్న గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ కళాశాలకు అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. పేపర్‌ లీకుపై వారం రోజుల్లో సమాధానమివ్వాలని నోటీసులో పేర్కొన్నారు. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే అవసరమైతే కాలేజీ గుర్తింపు రద్దు చేసి ప్రస్తుతం అక్కడ చదువుతున్న 109 మంది విద్యార్థులను ఇతర కాలేజీలకు పంపించే ఉద్ధేశ్యంలో అధికారులు ఉన్నట్లు సమాచారం.

ఏదేమైనా కళాశాల యాజమాన్యం షోకాజ్‌ నోటీసుకు ఇచ్చే సమాధానంపై అధికారుల నిర్ణయం ఆధారపడి ఉండే అవకాశం ఉంది. పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ పరీక్షలకు సంబంధించి 8, 9 తేదీల్లో జరగాల్సిన ప్రశ్నపతాలు మాత్రమే లీయక్యాయని, 10, 11 తేదీల్లో జరిగిన పరీక్షలు సాఫీగా జరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే పేపర్‌ లీకు విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement