Friday, May 10, 2024

సిద్ధార్థ్ ‘టక్కర్’ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ పై లేటెస్ట్ అప్డేట్..

కార్తీక్ జి క్రిష్ రచన, దర్శకత్వంలో సిద్ధార్థ్ హీరోగా తెర‌కెక్కిన లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ‘టక్కర్’. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 9న ఈ తమిళం, తెలుగు భాషలలో థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన మరో అప్ డేట్ వైరల్ అవుతోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంన్న‌ట్టు వార్తలు వినిపస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో సిద్ధార్థ్ కి జంట‌గా దివ్యాంశ కౌశిక్ నటించింది. టక్కర్ సినిమాలో సిద్దార్థ్, దివ్యాశ కౌశిక్ తో పాటు అభిమన్యు సింగ్, యోగి బాబు, మునిష్కాంత్, ఆర్జే విఘ్నేష్‌కాంత్ కీలక పాత్రల్లో నటించారు. టక్కర్‌ను ప్యాషన్ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ స్పాన్సర్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement