Friday, February 3, 2023

కాంగ్రెస్ కార్పొరేటర్‌పై భూ ఆక్రమణ కేసు నమోదు.. క‌బ్జాదారుల‌పై సీరియ‌స్ యాక్ష‌న్‌

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్): భూ కబ్జాదారులపై వరంగల్ కమిషనరేట్ పోలీసులు కొరడా జుళిపిస్తున్నారు. శుక్రవారం రాత్రి అధికార పార్టీ కార్పొరేటర్ పై హన్మకొండ పోలీసులు కేసు నమోదు చేయగా, తాజాగా శనివారం రాత్రి మడికొండ పోలీసులు కాంగ్రెస్ కార్పొరేటర్ పై కేసు నమోదు చేశారు. పార్టీలకు అతీతంగా భూ అక్రమణలకు పాల్పడుతున్న కబ్జాదారుల భరతం పట్టె చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

- Advertisement -
   

దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మడికొండ పోలీస్ స్టేషన్, కాజీపేట శివారు సోమిడి ప్రాంతంలోని తాళ్ల పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా ఐదు గుంటల భూమిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ కన్నేశారు.

నగేష్ కు చెందిన భూమిని ఆక్రమించేందుకు పునాది నిర్మాణం చేపట్టారు. బాధితుడు నగేష్ ఫిర్యాదు మేరకు మడికొండ పోలీసులు రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. స్థానికంగా విచారణ జరిపి శనివారం రాత్రి కేసు నమోదు చేసిన్నట్టు మడికొండ ఇన్‌స్పెక్ట‌ర్‌ వేణు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement