Friday, October 4, 2024

ఇలాగే డ్ర‌స్ వేసుకుంటా….అయితే ఏంటీ..

న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రోలో టెస్ట్‌గా ఓ యువ‌తి కేవ‌లం బ్రా, మైక్రో మినీ స్క‌ర్ట్‌తో ప్ర‌త్య‌క్షం కావ‌డం క‌ల‌క‌లం రేపింది. తాను ఇలాగే డ్ర‌స్ వేసుకుంటానంటూ ఆ యువ‌తి తెగేసి చెప్ప‌డంతో ప్ర‌యాణీకులు అవాక్క‌య్యారు. అదే మెట్రోలో ప్ర‌యాణిస్తున్న‌ కొంద‌రు ప్ర‌యాణీకులు మ‌హిళ ఫొటోలు, వీడియోల‌ను క్లిక్ మ‌నిపించి వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె ఎంచుకున్న డ్రెస్‌ను కొంద‌రు నెటిజ‌న్లు స‌మ‌ర్ధించ‌గా, పలువురు యూజ‌ర్లు ఇదేం డ్రెస్ అంటూ పెద‌వివిరిచారు. బాలీవుడ్ న‌టి ఉర్ఫీ జావేద్ ఇన్‌స్పిరేష‌న్‌తో ఆమె ఇలాంటి డ్రెస్‌లు ధ‌రిస్తోంద‌ని మ‌రికొంద‌రు యూజ‌ర్లు కామెంట్ చేశారు. బ్రా, మినీ స్క‌ర్ట్‌తో యువ‌తి ఢిల్లీ మెట్రోలో ప్ర‌యాణించిన ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి. కాగా ఇటువంటి డ్ర‌స్ ల‌తో ప‌బ్లిక్ లోకి రావ‌డం ప‌ట్ల ప్ర‌యాణీకులు మండిప‌డుతున్నారు.. మైక్రోడ్రెస్ ల‌తో వ‌స్తున్న‌వారిని మెట్రో స్టేష‌న్లోనే నిలువ‌రించాల‌ని కోరుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement