Thursday, May 2, 2024

జిడిపి అంటే ఏమిటి?…కెటిఆర్ ప్ర‌శ్న‌కు నెటిజెన్ల వింత సమాధానాలు..

హైదరాబాద్‌ :జీడీపీ(గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రొడ‌క్ట్‌‌) అనగా స్థూల జాతీయోత్పత్తి. ఒక దేశంలోని ఆర్థిక కార్యకలాపాల విలువను జీడీపీతో కొలుస్తారు. జీడీపీ వృద్ధి చెందుతుందంటే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందని అర్థం. దీని అర్ధం తెలిసినా మంత్రి కెటిఆర్ త‌న ట్విట్ట‌ర్ లో జిడిపి అంటే ఏమిటి అంటూ ప్ర‌శ్నించారు.. దీనిని నెటిజెన్ ఇచ్చిన స‌మాధానాలు కేంద్రానికి కాక‌పుట్టించేవిగా ఉన్నాయి.. దీనిపై నెటిజ‌న్లు స్పందిస్తూ.. గ్యాస్, డీజిల్‌, పెట్రోల్ అని గుజ‌రాత్‌, డీజిల్ పెట్రోల్ అని పెద్ద ఎత్తున స‌మాధానాలిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి అనే మాట అటుంచితే తన చర్యలతో సామాన్యుల నడ్డి విరగ్గొడుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో రూ. 400 ఉండే గ్యాస్‌ రూ. 800, రూ. 60 రూపాయలు ఉన్న పెట్రోలు రూ.100, డీజిల్‌ ప్రస్తుతం రూ.89, గతంలో రూ. 80 ఉన్న మంచినూనె రూ. 150 అయింది. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ పెరుగుదల ప్రతీ నిత్యావసర వస్తువుపై పడుతుండటంతో పేద, మధ్య తరగతి బ్రతుకులు భారమౌతున్నాయి. అచ్ఛేదిన్‌ అని జనం చచ్చే దిన్‌ తెచ్చారని అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ హాయాంలో జీడీపీ పెంచుతామంటే దేశాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకువెళతారనుకున్నాం కానీ ఇలా గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలను పెంచుతూపోతారని అనుకోలేదని నెటిజ‌న్స్ కేంద్రాన్ని అడుకుంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement