Monday, April 29, 2024

జేఆర్ సీ క‌న్వెన్ష‌న్ లో – కృష్ణ వ్రింద విహారి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్

యంగ్ హీరో నాగ‌శౌర్య న‌టిస్తోన్న తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి. హోం బ్యాన‌ర్‌ ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉషా మ‌ల్పూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో న్యూజిలాండ్ సింగ‌ర్‌, బాలీవుడ్ న‌టి షిర్లే సెటియా ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది షిర్లే సెటియా. అనిష్ ఆర్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.కాగా నాగ‌శౌర్య ప్ర‌స్తుతం ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి, నారి నారి న‌డుమ మురారి, పోలీస్ వారి హెచ్చ‌రిక సినిమాలు చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జేఆర్ సీ క‌న్వెన్ష‌న్ లో ఈ రోజు సాయంత్రం ఆరు గంట‌ల‌కి ప్రారంభం కానుంది. ఈ వేడుక‌కు ఈ మూవీ న‌టీ న‌టులు హాజ‌రుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement