Thursday, May 2, 2024

‘గ‌ని’ చిత్రం నుండి – ఐటెమ్ సాంగ్ రిలీజ్ – రెచ్చిపోయిన త‌మ‌న్నా

బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందుతోన్న చిత్రం గ‌ని. ఈ చిత్రంలో హీరోగా వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ను వచ్చింది. ఈ సినిమా ఐటెం సాంగ్‌ ను కాసేపటి క్రితమే వదిలింది చిత్ర బృందం. “కొడ్తే” అంటూ సాగే ఈ ఐటెం సాంగ్‌ లో హీరోయిన్‌ తమన్నా నటించింది. ఇక ఈ సాంగ్‌ విషయానికి వస్తే… ఈ సాంగ్‌ ఆధ్యాంతం.. తమన్నా చుట్టే తిరుగుతుంది. అలాగే.. తన హాట్‌ అందాలతో ఈ సాంగ్‌ తమన్నా రెచ్చి పోయింది. అదిరిపోయే స్టెప్పులు వేసి.. రచ్చ లేపింది తమన్నా. కాగా… ఈ సినిమా ఏప్రిల్‌ 18 కి విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement