Thursday, May 2, 2024

King’s Cup | సెమీఫైనల్‌లో ఇరాక్‌తో భార‌త్ ఢీ

థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 49వ కింగ్స్ కప్ ఫుట్‌బాల్ 2023 టోర్నీ సెమీఫైనల్‌లో టీమిండియా సీనియర్ పురుషుల ఇరాక్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ వ‌చ్చే నెల (సెప్టెంబర్) 7న థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మై స్టేడియంలో జరుగుతుంది. ఇక‌ అదే రోజు జరిగే మరో సెమీఫైనల్‌లో థాయ్‌లాండ్ లెబనాన్‌తో తలపడుతుంది. సెప్టెంబరు 10న ఫైనల్‌ జరగనుండగా.. ఓడిన జట్లు మూడో ప్లేస్‌ ప్లే ఆఫ్‌లో తలపడతాయి. 2010లో బాగ్దాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 0-2 తేడాతో ఇరాక్ చేతిలోభారత్ ఓడిపోయింది.

మ్యాచ్ ల షెడ్యూల్ :

ఇరాక్ వర్సెస్ ఇండియా (సెప్టెంబర్ 7)
థాయ్‌లాండ్ vs లెబనాన్ (సెప్టెంబర్ 7)
త‌ర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ (సెప్టెంబర్ 10)
ఫైనల్ (సెప్టెంబర్ 10)

Advertisement

తాజా వార్తలు

Advertisement