Thursday, May 2, 2024

Delhi : సుప్రీంను ఆశ్ర‌యించిన కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ పాలసీ కేసులో తన అరెస్ట్ సవాల్‌ను చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. అయితే అక్కడ ఊరట దక్కకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆయన తరపు న్యాయవాదులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సీజేఐ ఎదుట స్పెషన్ మెన్షన్ చేయనున్నారు ఆయన తరపు లాయర్లు.

- Advertisement -

అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు చెందిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను మార్చి 21వ తేదీన అరెస్ట్ చేసింది. అనంతరం కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీలోకి తీసుకొని విచారించింది. ఏప్రిల్‌ 15 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.

లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కేజ్రీవాల్ ను అరెస్టు చేసేందుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని.. ఆయన అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని స్పష్టం చేసింది. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఏప్రిల్ 1న ట్రయల్ కోర్టులో హాజరుపరచగా..ఆయనను ఏప్రిల్ 15 వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. దాంతో కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

అక్కడి నుంచి ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు. అరెస్ట్ చేసి, రిమాండ్ చేయడం చట్ట విరుద్ధమని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ బెంచ్ మంగళవారం తీర్పును ప్రకటించారు. 25 నిమిషాల పాటు తీర్పును చదివిన జస్టిస్ స్వర్ణ కాంత శర్మ.. కేజ్రీవాల్ అరెస్టుకు దారితీసిన ఆధారాలు ఈడీ వద్ద ఉన్నాయని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement