Thursday, May 9, 2024

కేసీఆర్ జాతీయ పార్టీ పెట్ట‌డం అనేది పెద్ద జోక్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం అనేదే.. ఈ పది సంవత్సరాల్లో అతిపెద్ద జోక్ అని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. ఉట్టికి ఎగరనోడు.. ఆకాశానికి ఎగిరాడట, దళితులను దగా చేసిన వ్యక్తి కేసీఆర్ అని మండిప‌డ్డారు. మోడీపై కల్వకుంట్ల కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తోంది అన్నారు. దేశంలో కుటుంబ పాలన తేవాలని, కుటుంబ పార్టీలన్నిటిని కలిపే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పాలన చేయడమే మోడీకి తెలుసు అన్నారు. ఎన్డీఏకు ఎప్పటికీ కేసీఆర్ ప్రత్యామ్నాయం కానే కాడు అన్నారు. కేసీఆర్ కు ఉన్నదే 7 సీట్లు.. ఇక కేసీఆర్ ఏం చేస్తాడో మీరే ఆలోచించండి అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కు 17 స్థానాల్లో ఒక్క సీటు కూడా రాదు అన్నారు. పంచాయ‌తీ నుంచి పార్లమెంటు వరకు, గల్లి నుంచి ఢిల్లీ వరకు 130 కోట్ల మంది ప్రజలతో జాతీయ జెండాను ఎగరవేసిన చరిత్ర బీజేపీది , నరేంద్ర మోడీది అన్నారు.

కేసీఆర్ ది అతిపెద్ద అవినీతి కుటుంబం, అవినీతి, నియంతృత్వ పాలన అన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని చేతిలో పెడితే… అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. రానున్న రోజుల్లో ఉద్యోగులు ఎవరికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అన్నారు. ట్రాన్స్ కో, జెన్కో లకు రూ.40వేల కోట్లు అప్పు ఉంది ఈ ప్రభుత్వం అన్నారు. భారతీయ జనతా పార్టీ మోటార్లకు మీటర్లు పెట్టదు, తప్పకుండా కేసీఆర్ అవినీతికి మీటర్లు పెడుతుంది అన్నారు. కెసిఆర్ ఏం చేశాడని దేశవ్యాప్తంగా కేసీఆర్ పాలన కావాలి?, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది?, దళితులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కేసీఆర్ ది అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ ఏమైంది?, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా… మోసం చేసిన చరిత్ర కేసీఆర్ ది అన్నారు. కేజీ టూ పీజీ హామీ ఏమైంది?, సంక్షేమ హాస్టల్లో రాళ్లతో అన్నం పెడుతున్నారు… కలుషిత ఆహారం తిని విద్యార్థులు మరణిస్తున్న ఘటనలను చూస్తున్నాం, మజ్లిస్ కు, ఓవైసీకి భయపడే పార్టీ బిజెపి కాదు అన్నారు. లక్ష మంది కేసీఆర్ లు, లక్ష మంది ఓవైసీలు వచ్చినా… 2024లో వచ్చేది బీజేపీ నే అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు బ్రమ్మరధం పడుతున్నారు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement