Saturday, April 27, 2024

ఆపద్భాంధవుడు కేసిఆర్‌.. వరద బాధితులను ఆదుకోవడం మా బాధ్యత: ఎంపీ వెంక‌టేశ్‌

10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంద‌ని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. ఆదివారం రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని 6వ డివిజన్ సప్తగిరికాలనీలో ఆయ‌న ఇవ్వాల ప‌ర్య‌టించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల‌తో ముంపున‌కు గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే చందర్‌ తో కలసి పరిశీలంచారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ వరద బాధితులు ఎదుర్కుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంత మేరకు ఆస్తినష్టం జరిగిందని ఆరా తీశారు.

వరద తాకిడితో ఇండ్లు కోల్పోయిన వారికి స్వయం ఇంటి పథకంతో 3లక్షల రూపాయల ప్రభుత్వ ఆర్థిక సహాయం వర్తింపచేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ వరద బాధితులకు త్వరితగతిన పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారని, ఆపదలో ఆదుకునే ఆపద్భాందవుడు మన కేసిఆర్‌ అని అభివర్ణించారు. వర్షం కారణంగా పలుప్రాంతాలు అస్తవ్యస్తమయ్యాయని, జన జీవనం అతలాకుతలమైందని, త్వరలోనే అంతా సద్దుమనుగుతుందని, వారిని ఆదుకోవడం తమ బాధ్యతని, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement