Monday, April 29, 2024

ఓటీటీలో క‌ణ్మ‌నీ రాంబో ఖ‌తీజా – ఈ నెల 27నుండి స్ట్రీమింగ్

స్టార్స్ విజ‌య్ సేతుప‌తి, స‌మంత‌,న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్రం క‌ణ్మ‌నీ రాంబో ఖ‌తీజా.తాజాగా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.హాట్ స్టార్ లో ఈ చిత్రం ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ హాట్ స్టార్ వారు ఈ చిత్రం క్రేజీ కాంబినేషన్ చూసి మంచి రేటుకు రిలీజ్ కు ముందే లాక్ చేసుకున్నట్లు సమాచారం. రొమాంటిక్‌, కామెడీ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కింది కాతు వాకుల రెండు కాద‌ల్.. ఈ చిత్రానికి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. కోలీవుడ్‌ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాను రౌడీ పిక్చర్స్‌, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి.ఈ చిత్రాన్ని తెలుగులో కణ్మనీ రాంబో ఖతీజా పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. హీరోని ఇద్దరు హీరోయిన్లు ప్రేమించడం.. అతన్ని దక్కించుకునేందుకు ఇద్దరు పోటీపడడం, వాళ్ల వల్ల హీరోకు సమస్యలు రావడం..చివరకు ఇద్దరితో హీరో కలిసి ఉండడం.. ఇటు వంటి ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీలు తెలుగు, తమిళ బాషల ఆడియన్స్ కు కొత్తేమీ కాదు. ‘కణ్మనీ రాంబో ఖతీజా’లో కొత్తదనం ఏమీ లేకపోవడం.. కథనం చాలా స్లోగా సాగడంతో ఫస్టాఫ్‌ అంతో బోర్‌ కొడుతుంది. కన్మణిగా నయనతార తనదైన నటనతో అదగొడితే.. ఖతీజాగా సమంత తన అందంతో ఆకట్టుకుంది. త‌మిళంలో హిట్ టాకే వ‌చ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement