Saturday, May 4, 2024

Kajal and Arjun Rampal – భగవంత్ కేసరి మూవీ హీరోయిన్ కాజల్, విల‌న్ రాంపాల్ ల ఫ‌స్ట్ లుక్

నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ భగవంత్ కేసరి. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాత్యాయని పాత్రలోనటిస్తున్న కాజల్ అగర్వాల్, విలన్ ‘రాహుల్ సంఘ్వీ’ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ లుక్ లను చిత్ర బృందం నేడు విడుద‌ల చేసింది. బీభత్సకరమైన ‘రాహుల్ సంఘ్వీ’గా జాతీయ అవార్డు గ్రహీత అర్జున్ రాంపాల్ ను పరిచేయం చేస్తున్నాం అంటూ చిత్ర బృందం వెల్లడించింది.

కాగా, . రేపు (అక్టోబరు 8) రాత్రి 8.16 గంటలకు చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మాతలుగా తెరకెక్కిన ఈ భారీ చిత్రం అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భగవంత్ కేసరి చిత్రంలో బాలకృష్ణతో పాటు కాజల్ అగర్వాల్, శ్రీలీల తదితరులు నటించారు. తమన్ సంగీతం అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement