Thursday, May 2, 2024

కైకాల సత్యనారాయణ మరణం.. సినీ పరిశ్రమకి తీరని లోటు.. బాలకృష్ణ

కైకాల సత్యనారాయణ మరణం తెలుగు సినీ పరిశ్రమకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు హీరో బాలకృష్ణ.. ఆహార్యం, అభినయం, ఆంగికాలతో అశేషాభిమానుల్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ మరణం చిత్ర పరిశ్రమతోపాటు, తెలుగువారికి తీరనిలోటు అని ఆయన అన్నారు. తెలుగు సినీ వినీలాకాశం ఒక గొప్ప ధ్రువతారను కోల్పోవడం విచారకరమని చెప్పారు. ఎన్టీఆర్ వంటి మహానుభావుడితో కలిసి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కైకాల చూపిన అభినయం ఎన్నటికీ మరువలేనిదని కొనియాడారు. సత్యనారాయణగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు, వారి అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని బాలకృష్ణ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement