Thursday, May 16, 2024

వన్డే ప్రపంకప్‌లో వారికి అవకాశం కష్టమే : కైఫ్‌

వన్డే ప్రపంచకప్‌-2023లో యువ ఆటగాళ్లకు అవకాశం దొరకడం కష్టమేనని భారత మాజీ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ కైఫ్‌ వాఖ్యనించాడు. ప్రస్తుతం గాయాలతో జాతీయ జట్టుకు దూరమైన సీనియర్‌ క్రికెటర్లు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. ఇప్పటికే భారత ప్రధాన బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించి ఐర్లాండ్‌ టూర్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. ఇతను ఫామ్‌లోకి వస్తే హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు కూడా టీమిండియాలో చాన్స్‌ దొరకడం కష్టమే అని అన్నాడు.

భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ పోటీలు జరుగనున్నాయి. చివరిసారి స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌-2011ను గెలిచిన టీమిండియా ఈసారి అదిరిపీట్‌ చేయాలని చూస్తోంది. తిరిగి భారత గడ్డపై మెగా ఈవెంట్‌ జరుగనుండటం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. అయితే గత కొంతకాలంగా సీనియర్‌ ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతూ జాతీయా జట్టుకు దూరమయ్యారు.

ప్రస్తుతం బుమ్రా పూర్తిగా కోలుకోగా.. కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌లు గాయాలతో కోలుకొని ఫిట్‌నేస్‌ కోసం కసరత్తులు మొదలెట్టారు. వీరు ప్రపంచకప్‌ వరకు తిరిగి జాతీయ జట్టులో చేరుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందుతున్న కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌లు ఈ నెల 30 నుంచి ఆరంభంకానున్న ఆసియా కప్‌ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కైఫ్‌ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌ టూర్‌లో ఉన్న భారత జట్టు ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో ఎన్నో ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే.

సీనియర్‌ ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్‌ శర్మలను పక్కన పెట్టి యువ ఆటగాళ్లకు అవకాశాలు కలిపించారు. ఈ సిరీస్‌ను టీమిండియా కష్టంగా 2-1తో గెలుచుకుంది. అయితే ఒకవేళ రాహుల్‌, అయ్యర్‌లు తిరిగోస్తే ఈ యువ ఆటగాళ్లకు ఎక్కడ చాన్స్‌ ఉంటుందని కైఫ్‌ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రోహిత్‌ శర్మతో ఓపెనర్‌గా గిల్‌ రావచ్చు, మూడు, నాలుగు స్థానాల్లో కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీలు అడుతారు. తర్వాతి స్థానాల్లో శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజాలు ఉండనే ఉన్నారు.

- Advertisement -

అయితే అలాంటప్పుడు ఇషాన్‌ కిషన్‌, సంజూ సంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లకు ఎక్కడ అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. విండీస్‌ పర్యటనపై అందరూ అనవరసరమైన చర్చలు చేస్తుతున్నారు. ఒకవేళ విరు టీమిండియాకు ఎంపికైనా తుది జట్టులో అవకాశం రావడం కష్టమే. మరోవైపు పేస్‌ విభాగంలో బుమ్రా, మహ్మద్‌ షమీ, శార్దుల్‌ ఠాకుర్‌లకు మెరుగైన అవకాశాలు ఉండటంతో తుది జట్టులో సిరాజ్‌కు కూడా చాన్స్‌ దొరకడం కష్టమేనని కైఫ్‌ పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement