Tuesday, May 7, 2024

సినీ య‌శ‌స్వీ – క‌ళా త‌ప‌స్వీ…

క‌ళా త‌ప‌స్వీ కె విశ్వ‌నాథ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా………

క‌ళామతల్లి నుదుట ”ఉండమ్మా బొట్టు పెడతా” అంటూ తన కళా కౌసల కౌస్తుభ తిలకం దిద్దిన దర్శకుడు. తెలుగు చలన చిత్రాలను విశ్వవేదికపై ప్రదర్శిం పజేసే ఆస్కారాన్ని కల్పించి భారతీయ కళలకు, సంస్కృతికి వన్నెతెచ్చి. తెలు గు వాళ్ళ ఆత్మగౌరవాన్ని తెర వెను కవుండి తెరకెక్కించిన సూత్రధారి. శ్రుతిలయలు సప్తపద గ్రస్తంగా మారి నెమలికి నడకలు నేర్పిస్తా యి. మురళికి ఆందని పలుకులు పలికిస్తాయి. ప్రతి పల్లెను రేపల్లెగ మార్చేస్తాయి. మదిని చేరి రాగం తానం పల్లవులుగా ప్రభవిస్తాయి. రాగా భరణాలు శంకరాభరణమై శంకరుని గళాన్ని అలంకరిస్తాయి. విధాత తలపున ప్రభవించిన వేదాలలో ఒకటైన సామవేద సారాన్ని సరస సుస్వ ర ఝరిగా మురళీరవంగా రూపాంతరం చెంది సినీవినీలాకాశంలో సిరివెన్నెలను కురిపిస్తాయి. సంగీత, నృత్య, సాహిత్యం సంగమించి కళాసాగ రసమంగా రూపోందుతాయి. ఆ కళా సాగరం లో ఎందరో నటీ నటులు స్వాతిముత్యాలుగా మెరిసారు. స్వయంకషితో ప్రకాశించే స్వాతి కిరణాలై సినీ జగత్తులో వెలుగులీనుతున్నారు. ఆ సిరిసిరి మువ్వలనాదం విశ్వనాధమై భారతీయ సంగీతానికి ప్రతీకగా ప్రతిధ్వనిస్తోంది. సంగీత సాహిత్యం సమలంకతదళ స్వర్ణకమలమై కళా సౌరభ పరిమళాన్ని వెదజల్లుతాయి. సీతామహా లక్ష్మి ఆశీస్సులను శుభలేఖలుగా ఇంటి ఇంటికి పంచుతాయి. శారదవీణా రాగచంద్రికల సుప్రభాతం శుభోదయానికి నాంది. తల్లిమనస్సు నెరిగిన చిన్నబ్బాయి తన చెల్లెలికాపురాన్ని కంటికి రెప్ప లా కాపాడుకొనేటట్లు చేస్తుంది. ‘పాశ్చాత్య సంగీ త పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్ర దాయ సంగీత జ్యోతిని ఒక్క కాపు కాయడానికి తన చేతులడ్డు పెట్టిన ఆపద్బాంధవుడు. ఔరా అమ్మకచెల్ల అనేటట్లు సెల్యులాయిడ్‌ పై కళాత్మక కళాఖండాలు రూపోందించడం మీకే చెల్లు కళ్ళ ప్పగించి చూస్తే యదలో ఆనందపు జల్లు. ఆది బిక్షువును అరాధించిన ఋషి కళాతపస్వి భారతీ య సినిమా యశస్వి. నందులు నీ నట్టింటికి వచ్చాయి నీవు విశ్వనాధుడివేకదా! నీ చిత్రం తెలుగునాట నాట్యం నేర్పించింది. శాస్త్రీయసంగీ తం తన గొంతు సవరించుకొంది. మూలపడ్డ సంగీతవాయిద్యాలు తమ శక్తిని కూడ దీసుకుని శృతిని సరి జేసుకున్నాయి. మూగమ్మాయి మౌన వేదనని సిరిసిరిమువ్వల నాదంగా వినిపింపజేసా వు. కళ్ళలేని కధానాయకుడికి మేరిసేతారలని చూ పించావు ప్రకృతికాంత హూయలను స్పృశింప జేశావు. కాస్మోటిక్‌ కవచం తీసేసి ఆందాల నటుడి నటనను పరిచయం చేశావు. ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా వాడేలెమ్మంది ఏడు వర్ణాలు కలిసి ఇంద్ర ధను సౌతాది అన్ని వర్ణాలకూ ఒకటే ఇ హము పరముం టాయి అన్న సత్యాన్ని చిత్రంద్వారా సమాజంలో కి చొప్పించావు. వైఫల్యం చెందిన కళాకారుని కధ ను తెరకెక్కించి జీవిత సాఫల్యాన్ని పొందటం నీ దర్శక ప్రతిభకు తార్కణం. నీ సినిమాలో పాత్రలు మామధ్య తిరిగే మనుష్యులవే. చిత్రంలో హాస్యం లాస్యంచేస్తుంది. నవరసాలు సమపాళ్ళలో రంగ రించి రసరమ్యచిత్రాలుగా మలచిన మాన్య మన స్వి. ”యతో హస్త తతో దృష్టి ,యతో దృష్టి తతో మన: యతో మన: తతో భావ:, యతో భావ: తతో రస:” దృష్టి మనస్సు భావము చేసే కళల యందు లగ్నం చేసినప్పుడే రస సిద్ది కలుగుతుంది. త్రికరణ శుద్దిగా తన కర్తవ్యాన్ని నిర్వహంచి చిత్ర యవ నికపై పై కళాత్మక చిత్రాలుగా తీర్చిదిద్ది భారతీయ సినిమాకి పేరుతెచ్చిన యశస్వి ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్న మనస్వి మన కళాతపస్వి, కాశీనాధు ని విశ్వనాధ్‌ విశ్వనాథ్‌ గారు మన తెలుగువాడు అయినందుకు మనం ఎంతో గర్వపడాలి. జ యంతితే సుక తినో రస సిద్ధా: కవీశ్వరా: నాస్తితే షాం యశ: కాయే జరామరణజం భయం!! నాస్తి జరామరణజం భయం!! నాస్తి జరామరణజం భయం!! ప్రేక్షకుల మనస్సు గెలిచిన మనస్వి మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు.
-శ్రీధ‌ర్ వాడ‌ప‌ల్లి.

Advertisement

తాజా వార్తలు

Advertisement