Sunday, April 28, 2024

ఎస్సీ, ఎస్టీ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.. శిక్షణ, ఆర్థిక తోడ్పాటుకు ప్రభుత్వం చర్యలు..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్ : షెడ్యూల్డ్‌ కులాల నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఆయా వృత్తుల్లో శిక్షణా కార్యక్రమాలతో పాటు, ఆర్థికంగా తోడ్పాటును అందించేందుకు తగు చర్యలను సంబంధిత శాఖ తీసుకుంటుంది. ఎస్సీ యువతకు రుణాలు ఇచ్చే సమయంలో బ్యాంకుల నుంచి సరైన ప్రోత్సాహం అందక పడుతున్న ఇబ్బందులను కూడా పరిష్కరించాలనే ఆలోచనలో ఉన్నారు. వృత్తి నైపుణ్యంలేని రుణాలను ఈ నెలాఖర్‌లోగా పూర్తి చేయాలనే యోచనలో ఉన్నారు. వృత్తి నైపుణ్యానికి సంబంధిచిన రుణాలను కూడా వచ్చే నెల డిసెంబర్‌లో చివరి నాటికి పూర్తిగా అమలు చేయనున్నారు. అందుకు గాను ఈ నెల చివర్లోనే జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

గతంలో ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా ఎన్‌ఎస్‌ ఎఫ్‌డీసీ పథకం కింద నేరుగా రుణాలు ఇచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడా పథకం లేకపోవడంతో బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి రుణాలు మంజూరైనప్పటికి బ్యాంకులు ఇచ్చే రుణాలు ఆలస్యం కావడం, నెలల తరబడి తిప్పుకోవడం వల్ల వస్తున్న సమస్యలను ముందే.. బ్యాంకర్లతో మాట్లాడి సమస్యలకు చెక్‌ పెట్టాలనే ఆలోచనతో కార్పోరేషన్‌ అధికారులున్నారు. ఒక వైపు దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూనే ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలను అందించాలనే కృత నిశ్చయంతో సర్కార్‌ ముందుకు సాగుతున్నది.

ఇదే అంశంపై ఇప్పటికే ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సబ్సిడీ రుణాలపై సమీక్ష నిర్వహించి.. కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని సూచించారు. సబ్సిడీ రుణాల కోసం ఎస్సీ నిరుద్యోగ యువత చేసుకున్న దరఖాస్తుల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని అర్హులైన వారికి ముందుగా క్లియర్‌ చేసి.. 2020- 21 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులను కూడా వీలైనంత తొందరగా గ్రౌండింగ్‌ చేసి పరి ష్కరించాలనే యోచనలో ఉన్నారు. దళితుల అభ్యు న్నతి కోసం సర్కార్‌ ఎక్కువగా ప్రధాన్యత ఇస్తున్న విషయాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఎస్సీ వర్గాల సంక్షేమం, ఉన్నతి, రుణ ప్రణాళిక అమలు, ఉపకార వేతనాలు, వసతి గృహాల నిర్వహణతో సాటు ఎస్సీ స్టడీ సర్కిళ్లను మరింత ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు తగిన చర్యలు చేపట్టారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement