Friday, March 29, 2024

CRDA చట్టం పునరుద్ధరణ.. బిల్లు రద్దు వెనుక కారణాలు ఇవీ

CRDA చట్టాన్ని పునరుద్ధరిస్తూ ఏపీ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెట్టింది. ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు శాసనసభలో ప్రకటించిన ప్రభుత్వం.. గతంలో రద్దు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ బిల్లును మంత్రి బుగ్గన ప్రకటించారు.  

ఏఎంఆర్డీఏకు బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సీఆర్డీఏకు బదిలీ చేస్తున్నట్టు బిల్లులో ప్రభుత్వం ప్రస్తావించారు. భాగస్వాములతో పూర్తిస్థాయి సంప్రదింపులు జరపకపోవటం, శాసనమండలిలో బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లటం వంటి అంశాలు వికేంద్రీకరణ చట్టాన్ని వెనక్కు తీసుకోడానికి కారణాలుగా ప్రభుత్వం తెలిపింది. వికేంద్రీకరణపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముందని భావిస్తున్నట్టు శాసనసభకు ఇచ్చిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. తక్షణమే సీఆర్డీఏ చట్టం 2014 అమల్లోకి వస్తుందని వికేంద్రీకరణ చట్ట ఉపసంహరణ బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement