Wednesday, May 8, 2024

NDA: ఎన్డీయేలో చేరిన జేడీఎస్‌

న్యూ ఢిల్లీ: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీయే కూటమిలో జేడీఎస్ పార్టీ చేరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఈరోజు ఢిల్లీలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి భేటీ అయ్యారు. వీరి సమావేశం ముగియగానే ఎన్డీయేలో చేరినట్టు కుమారస్వామి ప్రకటించారు. ఈ కీలక భేటీ సమయంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ కూడా అక్కడే ఉన్నారు. ఈ తాజా పరిణామంతో కర్ణాటకలో భాజపా, జేడీఎస్‌ మధ్య పొత్తు పొడుపులపై గత కొన్నాళ్లుగా వస్తోన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.

అయితే, కర్ణాటకలో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు. ఈ అంశంపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్‌ చేశారు. అమిత్‌ షా సమక్షంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి సమావేశమయ్యారన్నారు. జేడీఎస్‌ ఎన్డీయేలో భాగస్వామి కావాలని నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. జేడీఎస్‌ను హృదయపూర్వకంగా తమ కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఎన్డీయేను, ప్రధాని నరేంద్ర మోడీ న్యూ ఇండియా, స్ట్రాంగ్‌ ఇండియా విజన్‌ను బలోపేతం చేస్తుందని నడ్డా ట్వీట్‌ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement