Tuesday, May 14, 2024

BJP | నిన్న గంభీర్, ఈ రోజు జయంత్ సిన్హా.. పోటీకి దూరం !

బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ఆ పార్టీకి షాక్ ఇచ్చాడు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కోరారు. జయంత్ సిన్హా మాజీ కేంద్రమంత్రిగా పనిచేశారు, హజారీబాగ్‌కి బీజేపీ ఎంపీగా ఉన్నారు. తాను… భారత్, ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.

గతంలో నరేంద్రమోడీ క్యాబినెట్‌లో సిన్హా ఆర్థిక, పౌరవిమానయాన శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. తనకు అవకాశాలు అందించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్లుగా భారత్, హజారీబాగ్‌ ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు లభించిందని అన్నారు.

దీనికి ముందు పార్టీ ప్రముఖ నాయకుడు, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా జేపీ నడ్డాకు ఇదే రకమైన విజ్ఞప్తి చేశారు. తాను క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు తనను ప్రత్యక్ష రాజకీయాల నుంచితప్పించాలని కోరారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) రాబోయే ఎడిషన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) ఫ్రాంచైజీకి మెంటార్‌గా గంభీర్ వ్యవహరించనున్నారు. గంభీర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ ఎంపీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement