Tuesday, May 14, 2024

మూన్‌లైటింగ్‌ ఉద్యోగుల కు ఐటీ నోటీస్‌లు

మూన్‌ లైటింగ్‌ ద్వారా పొందుతున్న ఆదాయాన్ని కొందరు ఉద్యోగులు తమ రిటర్నుల్లో చూపించకపోవడంతో వారిని ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. 2019-20, 2020-21 ఆర్ధిక సంవత్సరాలకు ఆదాయాలకు సంబంధించిన ఐటీ శాఖ ఈ నోటీస్‌లు జారీ చేసినట్లు తెలిసింది. కరోనా సమయంలో మూన్‌లైటింగ్‌ గురించి అందరికీ తెలిసింది. ముఖ్యంగా ఇది ఐటీ రంగంలో వివాదాలకు కారణమైంది. ఒక కంపెనీలో పూర్తి స్థాయి ఉద్యోగిగా పని చేస్తూనే, తీరిక స మయాల్లో ఇతర కంపెనీల పనులు కూడా చేస్తూ అదనపు ఆదాయం పొందేవారు.

దీన్నే మూన్‌లైటింగ్‌ అని వ్యవహరిస్తున్నారు. మూన్‌లైటింగ్‌లో తప్పులేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా అదనంగా పని చేస్తూ సంపాదించడం వల్ల ఆర్ధికంగా ఆ ఉద్యోగికి ఉపయోగకరంగా ఉంటుందని కొందరు దీన్ని సమర్ధిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలా పని చేయడం నైతికంగా సరైంది కాదని వ్యవతిరేకిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కొంత మంది ఉద్యోగులు ప్రధాన కంపెనీలో తీసుకుంటున్న వేతనాల ఆదాయన్నే చూపిస్తూ ఐటీ రిటర్నులు దాఖలు చేశారని ఐటీ శాఖ గుర్తించింది. ఇలా గుర్తించిన ఉద్యోగులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు వార్షికాదాయాన్ని రిటర్నుల్లో చూపించని వారికి నోటీసులు పంపించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

- Advertisement -

ఇలా దాదాపు వెయ్యి మందికి పైగా నోటీసులు పంపించారు. తమ ఉద్యోగులు మూన్‌లైటింగ్‌ పాల్పడుతున్నారని కొన్ని కంపెనీలు స్వయంగా ఐటీ శాఖకు సమాచారం ఇచ్చారని తెల్సింది. రానున్న రోజుల్లో మరింత మందికి నోటీస్‌లు జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement