Thursday, May 2, 2024

సూర్యుడిపై ఇస్రో కన్ను … న‌వంబ‌ర్ లో ఆదిత్య 1 ప్ర‌యోగం

బెంగుళూరు: చంద్రుడి అధ్య‌య‌నం కోసం ఇటీవ‌లే చంద్ర‌యాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా ప్ర‌యోగించింది. ప్ర‌స్తుతం ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి క‌క్ష్య‌లో ఉంది. ఇక ఇప్పుడు భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ మ‌రో చ‌రిత్ర‌కు శ్రీకారం చుడుతోంది. త్వ‌ర‌లో సూర్యుడి అధ్య‌య‌నం కోసం ఆదిత్య ఎల్‌-1 మిష‌న్‌ను చేప‌ట్ట‌నున్న‌ది. అయితే ఆదిత్య ఎల్‌-1 మిష‌న్‌కు చెందిన ఫోటోల‌ను సోమ‌వారం ఇస్రో అప్‌డేట్ చేసింది.

బెంగుళూరులో త‌యారైన ఆ శాటిలైట్ ఇప్పుడు శ్రీహ‌రికోటకు చేరుకున్న‌ది. తొలిసారి సూర్యుడిని అధ్య‌య‌నం చేసేందుకు ఇస్రో స‌మాయాత్త‌మైంది. అయితే సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ఆదిత్య ఎల్‌-1ను ప్ర‌యోగించే అవ‌కాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement