Thursday, May 9, 2024

జూనియర్​ ఎన్టీఆర్, కొరటాల మూవీ టైటిల్ ఇదేనా?.. సోషల్​ మీడియాలో పలు గాసిప్స్​

డైరెక్టర్ కొరటాల శివ, జూనియర్​ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో సినిమా ‘ఎన్టీఆర్30’ టైటిల్‌పై ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్30 సినిమా టైటిల్‌ని ‘దేవర’గా ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతోంది. గతంలో కొరటాల, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కే ఓ చిత్రానికి నిర్మాత బండ్ల గణేష్ ‘దేవర’ పేరుని రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. తాజాగా ఆ టైటిల్​ని బండ్ల గణేశ్​ మర్చిపోవడంతో కొరటాల శివ ఈ టైటిల్ ని ఎంచుకున్నట్లు రూమర్స్​ వస్తున్నాయి. సినిమా కథతో పాటు ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కి ఈ సినిమా సెట్టవుతుందని మూవీ యూనిట్ భావించిందట. అయితే, ఇది ఇంకా కన్​ఫాం కాలేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement