Thursday, April 25, 2024

Spl Story: ఆ జానకి కలగనలేదేమో.. ఈ జానకి మాత్రం కల నిజం చేసుకుంటోంది!

ఆ జానకి కలగనలేదేమో.. రాముడు పతి అవుతాడని.. కానీ, ఈ జానకి మాత్రం రోజూ కలగంటూనే ఉంది. ఇట్లాంటి అద్భుత అవకాశం తనకు దక్కాలని, దాన్ని సాకారం చేసుకోవాలని.. అయితే.. ఆ కల నిజమయ్యే రోజు రానే వచ్చింది. టీ20 వరల్డ్​ కప్​ సెమీ-ఫైనల్స్ లో భారత్ ఇంగ్లండ్​ జట్టుపై​10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే.. భారత ప్రతిభ అక్కడితోనే ఆగిపోలేదు. ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగే ప్రపంచకప్ ముగింపు వేడుకలో మన స్వరం యావత్​ ప్రపంచం దృష్టిని ఆకర్షించే చాన్స్​ ఉంది. దానికి భారత సంతతి అమ్మాయి జానకి ఈశ్వర్ ఇచ్చే ​ ప్రదర్శన అందరినీ అలరించనుంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ప్రపంచ ప్రఖ్యాత రియాలిటీ షోలలో ‘ది వాయిస్’ ఆస్ట్రేలియాలో పేరుగాంచింది. ఆ సంస్థ నుంచి ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ.. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది 13ఏళ్ల భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ అమ్మాయి జానకి ఈశ్వర్. ఇప్పుడు ఈ అమ్మాయి వరల్డ్​ కప్​ ఫైనల్స్​ కోసం జరిగే ఈవెంట్​లో తన ప్రదర్శన ఇచ్చే చాన్స్​ దక్కించుకుంది. ట్వంటీ 20 ప్రపంచ కప్ ఫైనల్‌లో జానకి ప్రదర్శన ఉంటుందని ది వాయిస్​ తెలిపింది. ఆమె ఆస్ట్రేలియన్ రాక్ గ్రూప్ ఐస్‌హౌస్‌తో కలిసి ఈ ప్రదర్శన ఇవ్వనుంది. సాయంత్రం వేళ “ఐస్‌హౌస్ వి కెన్ గెట్ టుగెదర్” సమయంలో జానకి ప్రదర్శన ఉంటుందని, ఇందులో జింబాబ్వేలో పుట్టిన మరో యువతి తండో సిక్విలా కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరల్డ్ కప్ ఫైనల్‌లో ప్రదర్శన ఇచ్చే అవకాశంపై సంతోషం వ్యక్తం చేసింది ఈ టీనేజ్​ అమ్మాయి.

మెల్​బోర్న్​ క్రికెట్​ (MCG) ప్రేక్షకుల ముందు తాను ప్రదర్శన ఇవ్వడం..  ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ప్రసారం చేయడం నమ్మశక్యం కాని అనుభవం అని..  తన తల్లిదండ్రులు క్రికెట్ అభిమానులు అని చెబుతోంది జానకి ఈశ్వర్​. వారి ద్వారా తాను ఈ అవకాశం గురించి తెలుసుకున్నట్టు తెలిపింది. అయితే.. తాను ప్రదర్శనతోపాటు ఫైనల్​​ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పింది. ఇక.. భారత్ ఫైనల్ ఆడితే మరింత బాగుండేది అని ఆశాభావం వ్యక్తం చేసింది.

జానకి తల్లిదండ్రులు అనూప్ దివాకరన్, దివ్య రవీంద్రన్ కేరళలోని కోజికోడ్‌కు చెందినవారు . 15 సంవత్సరాలుగా వారు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. జానకి తల్లిదండ్రులు ఆమెకు మొదట భారతీయ సంగీతం నేర్పించారు. ఐదు సంవత్సరాల వయస్సులో కర్నాటక గానం నేర్చుకోవడం ప్రారంభించింది.

- Advertisement -

ఇక.. అధికారిక ICC మెన్స్​ T20 ప్రపంచ కప్ 2022 వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. మ్యాచ్ ప్రారంభానికి ముందు వేడుకలు జరుగుతాయి. ప్రపంచ కప్‌లో పాల్గొన్న ప్రతి జట్టును సత్కరిస్తారు. బహుళ సాంస్కృతిక నేపథ్యం ఉన్న కళాకారులకు ఇక్కడ ఆహ్వానం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది చూసే ఈ వేడుకల్లో తాను ప్రదర్శన ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని జానకి ఈశ్వర్​ తెలిపింది. 

టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనుంది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను పాకిస్థాన్ ఓడించగా, జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ భారత్‌ను చిత్తు చేసి శిఖరాగ్ర పోరులో ప్రవేశించింది. ఏది ఏమైనప్పటికీ, ఫైనల్ కోసం, వర్షం ముప్పు ఆదివారం వర్షం కురిసే అవకాశాలను సూచిస్తూ వాతావరణ సూచనతో ఛార్జ్ చేస్తుంది. షెడ్యూల్ చేసిన రోజున మ్యాచ్ జరగని పక్షంలో, సోమవారం రిజర్వ్ డే ఉందని గమనించడం ముఖ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement