Thursday, December 5, 2024

Iran :అమెరికా వైమానిక స్థావరంపై… ఇరాన్ దాడి

ఇరాక్‌లోని వైమానిక స్థావరంపై ఇరాన్ దాడి చేసింది. వాషింగ్టన్‌లోని అల్-అసద్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్‌ మద్దతుతో ఉగ్రవాదులు దాడి చేశారు. ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు పలు రాకెట్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. పశ్చిమ ఇరాక్‌లో ఇరాన్ మద్దతుగల ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో చాలా మంది అమెరికన్ సైనికులు గాయపడ్డారని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.

చాలా క్షిపణులు బేస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డగించబడ్డాయి. మరికొన్ని స్థావరంపై భీకర ప్రభావాన్ని కలిగించాయి. ఈ దాడిలో ఎంతమేరకు నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ ఉగ్రదాడిలో చాలా మంది సైనికులకు గాయాలయ్యాయని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులకు చెందిన మూడు యాంటీ షిప్ క్షిపణులను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. హౌతీ క్షిపణులు ఈ ప్రాంతంలోని వ్యాపార నౌకలు , యుఎస్ నేవీ నౌకలకు ముప్పు అని యుఎస్ మిలిటరీ తెలిపింది. అందుకే ఆత్మరక్షణ కోసం ఆ క్షిపణిపై దాడి చేసి ధ్వంసం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement