Thursday, May 2, 2024

ఐపీఎల్​ జట్లు.. వేలంలో సొంతమైన ఆటగాళ్లు వీళ్లే..

ఐపీఎల్‌ మెగావేలం రెండోరోజు ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టన్‌ హవా నడిచింది. ఫ్రాంచైజీలన్నీ అతడికోసం పోటీపడగా చివరకు పంజాబ్‌కింగ్స్‌ రూ.11.50కోట్లుకు కొనుగోలు చేసింది. దూకుడుగా ఆడే లివింగ్‌స్టన్‌ లెగ్‌స్పిన్నర్‌గా బౌలింగ్‌లోనూ రాణించగలడు. ఐపీఎల్‌ ఆటగాళ్ల జీవితాలను మార్చివేస్తుందని చెప్పేందుకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. అలాంటిదే ఐపీఎల్‌ మెగావేలం రెండోరోజు ఆదివారం చోటు చేసుకుంది. సింగపూర్‌ను ప్రపంచ క్రికెట్‌లో అండర్‌డాగ్‌గా భావిస్తారు. కనీసం టెస్టు హోదా కూడా లేదు. అయితే సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించే టిమ్‌ డేవిడ్‌ను అదృష్టం వరించింది. 6.5అడుగులు ఉండే టిమ్‌ డేవిడ్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించగలడు. 158.52 స్ట్రైక్‌రేట్‌ ఉన్న టిమ్‌ ఇప్పటివరకు 14 అంతర్జాతీయ టీ20లు ఆడి 558 పరుగులు చేశాడు. టిమ్‌ అత్యధిక స్కోరు 92నాటౌట్‌. ఆల్‌రౌండర్‌ టిమ్‌ డేవిడ్‌ కనీస ధర రూ.40లక్షలుకాగా ముంబై ఇండియన్స్‌ రూ.8.25కోట్లు కొనుగోలు చేసింది. స్పిన్నర్‌గానూ రాణించే టిమ్‌ డేవిడ్‌ గతంలో రాయల్‌ ఛాలెంజర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఐపీఎల్‌ మెగావేలం రెండోరోజు భారత్‌ అండర్‌-19 విజేత ఆటగాళ్లపై ఫ్రాంచైజీలన్నీ ఆసక్తి చూపాయి. ప్రపంచకప్‌ గెలిచిన కుర్రాళ్లను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డాయి. ఆల్‌రౌండర్‌ రాజ్‌ బవాను రూ.2కోట్లుకు పంజాబ్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది. అదేవిధంగా ఆల్‌రౌండర్‌ రాజ్‌వర్ధన్‌ హంగార్గేకర్‌ను రూ.1.5 కోట్లుకు చెన్నై సూపర్‌కింగ్స్‌ కొనుగోలు చేసింది. వెస్టిండీస్‌ వేదికగా జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా భారత్‌ను నిలిపిన కెప్టెన్‌ యశ్‌ధుల్‌ను ఢిల్లి క్యాపిటల్స్‌ రూ.50లక్షలకు కొనుగోలు చేసింది. కాగా వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఒడియన్‌ స్మిత్‌కు కూడా నేటివేలంలో భారీ ధర పలికింది. స్మిత్‌ను రూ.6కోట్లతో పంజాబ్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది. అమ్ముడుపోని ఆటగాళ్లకు మరో అవకాశం రాగా వీరిలో సాహా, మాథ్యూవేడ్‌, టీమిండియా సీనియర్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌తోపాటు కివీస్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌, అఎn్గాన్‌ ఆల్‌రౌండర్‌ నబీ అమ్ముడయ్యారు.

మార్కో జాన్సెన్‌కు సన్‌రైజర్స్‌ రూ.4.2కోట్లు..

ఇంగ్లండ్‌ స్పీడ్‌స్టర్‌ జోఫ్రా ఆర్చర్‌ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఆర్చర్‌ కోసం ప్రధానంగా సన్‌రైజర్స్‌, ముంబై ఇండియన్స్‌ తీవ్రంగా ప్రయత్నించాయి. ఆర్చర్‌ కనీస ధర రూ.2కోట్లుకాగా చివరకు ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్‌ రూ.8కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్చర్‌ బంతితో సత్తా చాటడంతోపాటు బ్యాటింగ్‌లో ఇన్నింగ్స్‌ చివర్లో సిక్సర్లతో మెరుపులు మెరిపించగలడు. ఆదివారం వేలంలో విండీస్‌ క్రికెటర్‌ రొమారియో షెపర్డ్‌ రూ.7.75కోట్లు పలికాడు. 27ఏళ్ల ఆల్‌రౌండర్‌ రొమారియోను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.7.75కోట్లుకు కొనుగోలు చేసింది. అదేవిధంగా దక్షిణాఫ్రికాలో భారతజట్టుపై విజయంలో కీలకపాత్ర పోషించిన సఫారీ యువ పేసర్‌ మార్కో జాన్సెను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం రూ.4.2కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తం మీద రెండు రోజులపాటు జరిగిన ఐపీఎల్‌ మెగావేలంలో 10 ఫ్రాంచైజీలు 204మంది ఆటగాళ్లను వేలంలో దక్కించుకున్నాయి. వీరిలో 67 మంది విదేశీ క్రికెటర్లు, 137మంది భారత ఆటగాళ్లు ఉన్నారు.

ముంబై ఇండియన్స్‌..

ఇషాన్‌కిషన్‌ (రూ.15.25కోట్లు), టిమ్‌ డేవిడ్‌ (రూ.8.25కోట్లు), జోఫ్రా ఆర్చర్‌ (రూ.8కోట్లు), బ్రేవిస్‌(రూ.3కోట్లు), డానియల్‌ సామ్స్‌ (రూ.2.60కోట్లు), తిలక్‌వర్మ (రూ.1.70కోట్లు), ఎం. అశ్విన్‌ (రూ.1.60కోట్లు), టైమల్‌ మిల్స్‌ (రూ.1.50కోట్లు), జయదేవ్‌ ఉనద్కత్‌ (రూ.1.30కోట్లు), మెరిడిత్‌ (రూ.1కోటి),ఫాబియన్‌ అలెన్‌ (రూ.75లక్షలు), మయాంక్‌ మార్కండే (రూ.65లక్షలు), సంజయ్‌ యాదవ్‌ (రూ.50లక్షలు), థంపీ (రూ.30లక్షలు), అర్జున్‌ టెండూల్కర్‌ (రూ.30లక్షలు), రాహుల్‌ బుద్ధి (రూ.20లక్షలు), హృతిక్‌ షోకెన్‌ (రూ.20లక్షలు), అర్షద్‌ఖాన్‌ (రూ.20లక్షలు), అన్‌మోల్‌సింగ్‌ (రూ.20లక్షలు), రమణదీప్‌సింగ్‌ (రూ.20లక్షలు), ఆర్యన్‌ జుయల్‌ (రూ.20లక్షలు).

- Advertisement -

పంజాబ్‌ కింగ్స్‌..

లివింగ్‌స్టోన్‌ (రూ.11.50కోట్లు), రబాడ (రూ.9.25కోట్లు), షారుక్‌ఖాన్‌ (రూ.9కోట్లు),ధావన్‌ (రూ.8.25కోట్లు), బెయిర్‌స్టో (రూ.6.75కోట్లు), ఒడియన్‌ స్మిత్‌ (రూ.6కోట్లు), రాహుల్‌ చాహర్‌ (రూ.5.25కోట్లు), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (రూ.3.80కోట్లు), రాజ్‌ బవా (రూ.2కోట్లు), వైభవ్‌ ఆరోరా (రూ.2కోట్లు), నాదన్‌ఎలీస్‌ (రూ.75లక్షలు), ప్రభ్‌సిమ్రన్‌ (రూ.60లక్షలు), రిషీధావన్‌ (రూ.55లక్షలు), సందీప్‌శర్మ (రూ.50లక్షలు), భానుక రాజపక్స (రూ.50లక్షలు), బెన్నీ హవెల్‌ (రూ.40లక్షలు), పొరెల్‌ (రూ.25లక్షలు), కుల్దిdప్‌ యాదవ్‌ (రూ.20లక్షలు),జితేశ్‌ (రూ.20లక్షలు), జితేశ్‌శర్మ (రూ.20లక్షలు),ప్రేరక్‌ మన్కడ్‌ (రూ.20లక్షలు). బల్బేజ్‌సింగ్‌ (రూ.20లక్షలు), రిట్టిక్‌ ఛటర్జీ (రూ.20లక్షలు), అన్ష్‌పటేల్‌ (రూ.20లక్షలు), అధర్వ (రూ.20లక్షలు).

రాజస్థాన్‌ రాయల్స్‌..

ప్రసిద్ధ్‌ (రూ.10కోట్లు), హెట్‌మయర్‌ (రూ.8.50కోట్లు), బౌల్ట్‌ (రూ.8కోట్లు), పడిక్కల్‌ (రూ.7.75కోట్లు), చాహల్‌ (6.50కోట్లు), అశ్విన్‌ (రూ.5కోట్లు), పరాగ్‌ (రూ.3.80కోట్లు), సైనీ (రూ.2.60కోట్లు),కౌల్టర్‌నైల్‌ (రూ.2కోట్లు), జేమ్స్‌ నీషమ్‌ (రూ.1.5కోట్లు), జేమ్స్‌ నీషమ్‌ (రూ.1.5కోట్లు), కరుణ్‌ నాయర్‌ (రూ.1.40కోట్లు), డసెన్‌ (రూ.కోటి), మిచెల్‌ (రూ.75లక్షలు), ఒబెద్‌ (రూ.75లక్షలు), కరియప్ప (రూ.30లక్షలు),అరుణమ్‌సింగ్‌ (రూ.20లక్షలు), కుల్దీప్‌ యాదవ్‌ (రూ.20లక్షలు), తేజాస్‌ బరోకా (రూ.20లక్షలు), శుభంగర్వాల్‌ (రూ.20లక్షలు), డారెల్‌ కుల్దిdప్‌సేన్‌ (రూ.20లక్షలు), ధ్రువ్‌ (రూ.20లక్షలు).

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు..

హర్షల్‌పటేల్‌ (రూ.10.75కోట్లు), హసరంగ (రూ.10.75కోట్లు), హేజిల్‌వుడ్‌ (రూ.7.75కోట్లు), డుప్లెసిస్‌ (రూ.7కోట్లు), దినేశ్‌కార్తీక్‌ (రూ.5.50కోట్లు), అనుజ్‌ (రూ.3.40కోట్లు), షాబాజ్‌ (రూ.2.40కోట్లు), డేవిడ్‌ విల్లే (రూ.2కోట్లు), రూథర్‌ఫర్డ్‌ (రూ.1కోటి), సిద్ధార్ధ్‌ కౌల్‌(రూ.75లక్షలు), జాసన్‌ (రూ.75లక్షలు), కరణ్‌శర్మ (రూ.50లక్షలు).ఆకాశ్‌దీప్‌ (రూ.20లక్షలు), సువర్ష్‌ (రూ.30లక్షలు), వి మిలింద్‌ (రూ.25లక్షలు), మహిపాల్‌ (రూ.95లక్షలు), ఫిన్‌ అలెన్‌ (రూ.80లక్షలు), ఆకాశ్‌దీప్‌ (రూ.20లక్షలు), అనీశ్వర్‌ గౌతమ్‌ (రూ.20లక్షలు),లవ్‌నీత్‌ సిసోడియా (రూ.20లక్షలు).

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..

నికోలస్‌ పూరన్‌ (10.75కోట్లు), సుందర్‌ (8.75కోట్లు), త్రిపాఠి (రూ.8.50కోట్లు), రొమారియో షెపర్డ్‌ (రూ.7.75కోట్లు), అభిషేక్‌శర్మ (రూ.6.50కోట్లు), భువనేశ్వర్‌ (4.20కోట్లు), మార్కో జాన్సెన్‌ (రూ.4.20కోట్లు), నటరాజన్‌ (రూ.4కోట్లు), త్యాగి (రూ.4కోట్లు), మార్‌క్రమ్‌ (రూ.2.60కోట్లు), సీన్‌ అబాట్‌ (రూ.2.40కోట్లు), గ్లెన్‌ఫిలిప్స్‌ (రూ.1.50కోట్లు), శ్రేయస్‌ గోపాల్‌ (రూ.75లక్షలు), విష్ణువినోద్‌ (రూ.50లక్షలు), ఫరూఖీ (రూ.50లక్షలు), గార్గ్‌ (రూ.20లక్షలు), రవికుమార్‌ (రూ.20లక్షలు), సౌరభ్‌ దూబే (రూ.20లక్షలు). సుచిత్‌ (రూ.20లక్షలు). పూరన్‌సింగ్‌ (రూ.20లక్షలు).

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌..

అవేశ్‌ఖాన్‌ (రూ.10కోట్లు), హోల్డర్‌ (రూ.8.75కోట్లు), కృనాల్‌ (రూ.8.25కోట్లు), డికాక్‌ (రూ.6.75కోట్లు), వుడ్‌ (రూ.7.50కోట్లు), హుడా (5.75కోట్లు), పాండే (4.60కోట్లు), చమీర (రూ.2కోట్లు), ఎవిన్‌లూయిస్‌ (రూ.2కోట్లు), షాబాజ్‌ నదీమ్‌ (రూ.50లక్షలు), వోహ్రా (రూ.20లక్షలు), ఆయుష్‌ (రూ.20లక్షలు) కైల్‌మేయర్‌ (రూ.50లక్షలు), కరణ్‌శర్మ (రూ.20లక్షలు), అంకిత్‌ (రూ.50లక్షలు), కృష్ణప్పగౌతమ్‌ (రూ.90లక్షలు), మయాంక్‌ యాదవ్‌ (రూ.20లక్షలు).

కోల్‌కతా నైట్‌రైడర్స్‌..

శ్రేయస్‌ అయ్యర్‌ (రూ.12.25కోట్లు), రాణా (రూ.8కోట్లు), శివంమావి (రూ.7.25కోట్లు), పాట్‌కమిన్స్‌ (రూ.7.25కోట్లు), అలెక్స్‌హేల్స్‌ (రూ.2.50కోట్లు), ఉమేశ్‌ యాదవ్‌(రూ.2కోట్లు), సామ్‌బిల్లింగ్స్‌ (రూ.2కోట్లు), నబీ (రూ.కోటి), రహానె (రూ.1కోటి), టిమ్‌ సౌథీ (రూ.1.50కోట్లు), ఎస్‌ జాక్సన్‌ (రూ.60లక్షలు),రింకుసింగ్‌ (రూ.55లక్షలు), అశోక్‌శర్మ (రూ.55లక్షలు), కరుణరత్నే (రూ.50లక్షలు), అభిజిత్‌ తోమర్‌ (రూ.40లక్షలు), ప్రీతమ్‌సింగ్‌ (రూ.20లక్షలు), రమేశ్‌కుమార్‌ (రూ.20లక్షలు), అమన్‌ హకీమ్‌ఖాన్‌ (రూ.20లక్షలు).అనుకుల్‌రాయ్‌ (రూ.20లక్షలు), సాల్మన్‌ (రూ.20లక్షలు), బాబా ఇంద్రజిత్‌ (రూ.20లక్షలు).

గుజరాత్‌ టైటాన్స్‌..

ఫెర్గూసన్‌ (రూ.10కోట్లు), తెవాతియా (రూ.9కోట్లు), షమీ (రూ.6.25కోట్లు), సాయికిశోర్‌ (రూ.3కోట్లు), అభినవ్‌ (రూ.2.60కోట్లు), అల్జారీ జోసెఫ్‌ (రూ.2.40కోట్లు), మాథ్యూవేడ్‌ (రూ.2.40కోట్లు), రాయ్‌ (రూ.2కోట్లు), సాహా (రూ.1.90కోట్లు), జయంత్‌ యాదవ్‌ (రూ.1.70కోట్లు), విజయ్‌శంకర్‌ (రూ.1.40కోట్లు), డ్రేక్స్‌ (రూ.1.10కోట్లు), గురుకీరత్‌ సింగ్‌ మాన్‌ (రూ.50లక్షలు), వరుణ్‌ ఆరోన్‌ (రూ.50లక్షలు), నూర్‌ అహ్మద్‌ (రూ.30లక్షలు), సాయి సుదర్శన్‌ (రూ.20లక్షలు), దర్శన్‌ (రూ.20లక్షలు), ప్రదీప్‌ సంగ్వాన్‌ (రూ.20లక్షలు).

ఢిల్లి క్యాపిటల్స్‌..

శార్దూల్‌ ఠాకూర్‌ (రూ.10.75కోట్లు), మిచెల్‌మార్ష్‌ (రూ.6.50కోట్లు),డేవిడ్‌ వార్నర్‌ (రూ.6.25కోట్లు), ఖలీల్‌ అహ్మద్‌ (రూ.5.25కోట్లు), చేతన్‌ సకారియా (రూ.4.20కోట్లు), పావెల్‌ (రూ.2.80కోట్లు), ముస్తాపిజుర్‌(రూ.2కోట్లు), భరత్‌ (రూ.2కోట్లు), కుల్‌దీప్‌ (రూ.2కోట్లు), నాగర్‌కోటి (రూ.1.10కోట్లు), మన్‌దీప్‌సింగ్‌ (రూ.1.10కోట్లు), లలిత్‌ యాదవ్‌ (రూ.65లక్షలు), రిపిల్‌పటేల్‌ (రూ.20లక్షలు), యశ్‌ధుల్‌ (రూ.50లక్షలు), ప్రవీణ్‌దూబె (రూ.50లక్షలు), ఎంగిడి (రూ.50లక్షలు), టిమ్‌ సీఫెర్ట్‌ (రూ.50లక్షలు), విక్కీ (రూ.20లక్షలు), అశ్విన్‌హెబ్బార్‌ (రూ.20లక్షలు), సర్ఫరాజ్‌ (రూ.20లక్షలు).

చెన్నై సూపర్‌కింగ్స్‌..

దీపక్‌ చాహర్‌ (రూ.14కోట్లు), అంబటి రాయుడు (రూ.6.75కోట్లు), బ్రావో (రూ.4.4కోట్లు), శివందూబె (రూ.4కోట్లు), క్రిస్‌జోర్డాన్‌ (రూ.3.60కోట్లు), ఉతప్ప (రూ.2కోట్లు), మిచెల్‌ శాంట్నర్‌ (రూ.1.90కోట్లు), మిల్నే (రూ.1.90కోట్లు), రాజ్‌వర్ధన్‌ (రూ.1.5కోట్లు), డేవాన్‌ కాన్వే (రూ.1కోటి), ప్రశాంత్‌ సోలంకి (రూ.1.20కోట్లు), మహేశ్‌ తీక్షణ (రూ.70లక్షలు), ప్రిటోరియస్‌ (రూ.50లక్షలు), తుషార్‌ (రూ.20లక్షలు), భగత్‌వర్మ (రూ.20లక్షలు), ఆసీఫ్‌ రూ.20లక్షలు, ముకేశ్‌ చౌదరీ (రూ.20లక్షలు), హరినిశాంత్‌ (రూ.20లక్షలు), జగదీశన్‌ (రూ.20లక్షలు).

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement