Thursday, December 5, 2024

జీతాలు చెల్లించాలంటూ ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ముట్టడి..

ముత్తుకూరు, (ప్రభ న్యూస్) : నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ దామోదరం సంజీవయ్య ఏపీ జెన్కో బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న వందలాది మంది ఇంజనీర్లు సోమవారం మధ్యాహ్నం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ పరిపాలన భవనాన్ని ముట్టడించారు. నెలవారీ జీతాలు చెల్లించలేదని మూకుమ్మడిగా మధ్యాహ్న భోజన సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఏపీ జెన్కో ప్రాజెక్టు జేఏసీ నాయకులు గుమ్మడి శ్రీనివాసులు, కృష్ణ చైతన్య నేతృత్వం వహించారు.

రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ట్రాన్స్కో సి.ఎం.డి నాగులపల్లి శ్రీకాంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించాలంటూ ఘొరావ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికివ్యతిరేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement