Friday, May 17, 2024

యూఏఈలో ఐపీఎఫ్‌.. ప్రవాస భారతీయుల కోసం కృషి

యూఏఈలోని ప్రవాస భారతీయులందరినీ ఒకే చోట చేర్చి సమన్వయం చేసేందుకు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇండియన్‌ పీపుల్స్‌ ఫోరమ్‌ (ఐపీఎఫ్‌) ఎంతో కృషి చేస్తోందని ఉత్తిష్ట భారత వ్యవస్థాపకుడు, భారతీయ ప్రజా దత్యవేత్త అభిషేక్‌ జిగిని అన్నారు. యూఏఈలో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రతీ ప్రవాస భారతీయుడికి చేరువ అయ్యేలా తమ సంస్థ మరింత విస్తరిస్తోందన్నారు. ఇండియన్‌ పీపుల్స్‌ ఫోరమ్‌, యూఏఈలో వృత్తి, వ్యాపారం చేస్తున్న ఎన్‌ఆర్‌ఐల వివిధ సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పుకొచ్చారు. యూఈఏ ప్రభుత్వం, యూఈఏలోని భారత కాన్సులేట్‌తో సన్నిహితంగా పని చేస్తున్నామని వివరించారు.

తమ సంస్థ విస్తరణలో భాగంగా.. తాజాగా తెలంగాణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా నూతన విభాగం, కమిటీ సభ్యులు కూడా హాజరైనట్టు వివరించారు. కరోనా సమయంలో ఐపీఎఫ్‌ అందించిన ప్రత్యేక సేవలను కొనియాడారు. కొత్తగా నియమించబడిన ఐపీఎఫ్‌ తెలంగాణ వర్కింగ్‌ కమిటీని అభినందించారు. రెండు దేశాల మధ్య ప్రజా దత్యాన్ని పెంపొందించేందుకు తన ఆలోచనలను సభ్యులతో పంచుకున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఇండియన్‌ పీపుల్స్‌ ఫోరమ్‌ సెంట్రల్‌ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఐపీఎఫ్‌ తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా మహేందర్‌రెడ్డిని ప్రకటించారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement