Saturday, April 27, 2024

AP | మూలపాడులో అంతర్జాతీయ క్రికెట్‌ టోర్నమెంట్‌… 5న విజయవాడకు ఇంగ్లండ్‌ జట్టు

ఇబ్రహీంపట్నం, (విజయవాడ) ప్రభ న్యూస్‌: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) పర్యవేక్షణలో ఈ నెల 13 నుంచి 27 వరకు అండర్‌ -19 పురుషుల అంతర్జాతీయ క్వాడ్రాంగ్యులర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎన్టీఆర్‌ జిల్లా మూలపాడులోని డీవీఆర్‌, సీపీ గ్రౌండ్లలో నిర్వహించనున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌ రెడ్డి వెల్లడించారు.

మూలపాడులోని ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీఏ జాయింట్‌ సెక్రెటరీ ఎ.రాకేష్‌, అపెక్స్‌ కౌన్సిల్‌ మెంబర్‌ జితేంద్రనాథ్‌ శర్మతో కలిసి ఏసీఏ కార్యదర్శి గోపినాథ్‌ రెడ్డి మాట్లాడారు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌ జట్లు, మన దేశం తరపున ఇండియా – ఎ, ఇండియా – బీ జట్లు- పాల్గొంటున్నట్లు తెలిపారు. మొత్తం నాలుగు జట్లు టోర్నమెంట్‌లో పాల్గొంటాయన్నారు.

ఈ నెల 5న ఇంగ్లండ్‌ జట్టు విజయవాడ విచ్చేసి మూలపాడులోనాలుగు రోజులపాటు ప్రాక్టీస్‌ చేయనుందని తెలిపారు. బంగ్లాదేశ్‌ జట్టు 10న విజయవాడకు చేరుకుంటుందన్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే విశాఖపట్నంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ – వీడీ సీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈ నెల 23న ఇండియా – ఆస్ట్రేల్రియా టీ- 20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

మూలపాడులో జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌..

తేదీమ్యాచ్వేదిక
13-11-23
ఇండియా (ఏ) – బంగ్లాదేశ్‌ డీవీఆర్‌ గ్రౌండ్‌
13-11-23
ఇండియా (బీ) – ఇంగ్లండ్‌ సీపీ గ్రౌండ్‌
15-11-23
ఇండియా (బీ) – బంగ్లాదేశ్‌ డీవీఆర్‌ గ్రౌండ్‌
15-11-23
ఇండియా (ఎ) – ఇంగ్లండ్‌ సీపీ గ్రౌండ్‌
17-11-23
ఇండియా (ఏ) – ఇండియా (బీ) డీవీఆర్‌ గ్రౌండ్‌
17-11-23
ఇంగ్లండ్‌ – బంగ్లాదేశ్‌ సీపీ గ్రౌండ్‌
20-11-23
ఇండియా (బీ) – ఇంగ్లండ్‌ డీవీఆర్‌ గ్రౌండ్‌
20-11-23
ఇండియా (ఏ) – బంగ్లాదేశ్‌ సీపీ గ్రౌండ్‌
22-11-23
ఇండియా (ఏ) – ఇంగ్లండ్‌ డీవీఆర్‌ గ్రౌండ్‌
22-11-23
ఇండియా (బీ) – బంగ్లాదేశ్‌ సీపీ గ్రౌండ్‌
24-11-23
ఇంగ్లండ్‌ – బంగ్లాదేశ్‌ డీవీఆర్‌ గ్రౌండ్‌
24-11-23
ఇండియా (ఏ) – ఇండియా (బీ) సీపీ గ్రౌండ్‌
27-11-23
ఫైనల్‌ మ్యాచ్డీవీఆర్‌ గ్రౌండ్‌
27-11-23 3వ ప్లేస్‌ మ్యాచ్సీపీ గ్రౌండ్
Advertisement

తాజా వార్తలు

Advertisement