Wednesday, May 15, 2024

100శాతం సిలబస్‌తో ఇంటర్‌ పరీక్షలు.. ఆదేశాలు జారీ చేసిన ఇంటర్‌ బోర్డు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక నిర్కణయం తీసుకుంది. ఈ ఏడాది 100శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వందశాతం సిలబస్‌కు సంబంధించిన నమూనా ప్రశ్నాపత్రాలు ఇంటర్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. కొవిడ్‌ కారణంగా గత రెండేళ్ల నుంచి 70శాతం సిలబస్‌తో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొవిడ్‌ వ్యాప్తి సమసిపోవడం, ఈ ఏడాది జూన్‌ 15 నుంచి కాలేజీలు కొనసాగుతున్నందున ఈ ఏడాది 100శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించాలని ఇంటీర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి తెలిపారు. తాజా నిర్ణయంతో ఇంటీర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు ఈ ఏడాది 2022-23 వార్షిక పరీక్షలకు 100శాతం సిలబస్‌ను చదవాల్సి ఉంటుంది. ఇంటర్‌ సిలబస్‌తోపాటు నమూనా ప్రశ్నాపత్రాలను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. అదేసమయంలో మోడల్‌ ప్రశ్నాపత్రాలను పాఠ్యపుస్తకాల్లోని వెనుక పేజీల్లో ఇప్పటికే ఇచ్చినట్లు నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.

24 నుంచి ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ తరగతులు…

- Advertisement -

ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయిందని నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. 5556 ఎంటెక్‌ సీట్లలో మొదటి విడతలో 2522 సీట్లు భర్తీ చేసినట్లు చెప్పారు. 3106 ఎంఫార్మసీ సీట్లలో మొదటి విడతలో 2163 సీట్లు భర్తీ చేశామన్నారు. 153 ఎంఆర్క్‌ సీట్లలో మొదటి విడతలో 46 సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. ఈ నెల 19 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని, ఈ నెల 24 నుంచి ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement